Breaking News

ఖలిస్తానీ నేత హత్య వీడియో.. తొలిసారి టీవీలో ప్రసారం

Published on Sat, 03/09/2024 - 11:41

ఒట్టావా: ఖలిస్తానీ అనుకూల నేత హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య వీడియో తొలిసారి కెనడాలోని ఓ టీవీ చానల్‌లో ప్రసారమైంది.  గత ఏడాది జూన్‌ 18న కెనడా బ్రిటీష్‌ కొలంబియా ప్రావిన్సులోని సర్రే పట్టణంలో ఉన్న గురునానక్‌ సిక్‌ గురుద్వారా సాహిబ్ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే.

ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ వీడియోను కెనడాలో తొలిసారిగా అధికారిక సీబీసీ న్యూస్‌ చానల్‌ ప్రసారం చేసింది. గురుద్వారా పార్కింగ్‌ ప్లేస్‌లో నిజ్జర్‌ ప్రయాణిస్తున్న వైట్‌ సెడాన్‌కారును ఒక పిక్‌అప్‌ ట్రక్కు తొలుత అడ్డగిస్తుంది. అనంతరం ట్రక్కులో నుంచి నిజ్జర్‌ వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన మాస్కులు ధరించిన వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి అక్కడే వేచి ఉన్న టయోటా క్యామ్రీ కారులో ఎక్కి పారిపోయిన దృశ్యాలు ప్రసారమయ్యాయి.

ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేకపోయింది. నిజ్జర్‌ హత్య కేసును ఇంటిగ్రేటెడ్‌ హోమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(ఐహెచ్‌ఐటీ)దర్యాప్తు చేస్తోంది. నిజ్జర్‌ హత్యతో భారత వేగులకు సంబంధముందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్‌ 18న ఆ దేశ పార్లమెంటులో వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల తర్వాత భారత్‌, కెనడా మధ్య సంబంధాలు బలహీనమయ్యాయి.      

ఇదీ చదవండి.. కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)