Breaking News

ఇరాన్‌ దాడులు.. ఇజ్రాయెల్‌కు పోప్‌ కీలక సూచన

Published on Sun, 04/14/2024 - 16:44

వాటికన్‌సిటీ: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంపై పోప్‌ ఫ్రాన్సిస్‌ స్పందించారు. ఇరాన్‌ డ్రోన్‌ దాడులకు ఇజ్రాయెల్‌ స్పందించవద్దని లేదంటే హింస పెరుగుతుందని పోప్‌ అన్నారు. ‘యుద్ధం చాలు, దాడులు చాలు, హింస చాలు. శాంతి కావాలి. చర్చలు కావాలి’అని వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్‌ స్క్వేర్‌ వద్ద సందర్శకులను ఉద్దేశించి పోప్‌ ప్రసంగించారు.   

కాగా, ఇజ్రాయెల్‌పై శనివారం(ఏప్రిల్‌ 13)  రాత్రి వందల కొద్దీ డ్రోన్‌లతో ఇరాన్‌ దాడులు చేసింది. ఈ డ్రోన్‌లు, మిసైళ్లలో చాలా వాటిని ఇజ్రాయెల్‌ కూల్చి వేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ దాడులకు ఇజ్రాయెల్‌ ఎలా స్పందిస్తుందనేది ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు పోప్‌ సూచన కీలకంగా మారింది. సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఆ దేశ ఆర్మీ ఉన్నతాధికారులను ఇజ్రాయెల్‌ చంపినందుకే ఇరాన్‌ డ్రోన్‌లు, మిసైళ్లతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. 

ఇదీ చదవండి.. ఇరాన్‌ దాడులు అమెరికా వ్యూహం ఫలించిందా

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)