Breaking News

2026 జూన్‌లోగా బంగ్లా ఎన్నికలు: యూనస్

Published on Thu, 05/29/2025 - 12:35

ఢాకా: బంగ్లాదేశలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. దేశంలో ఎన్నికలు నిర్వహించాలని అన్నివైపుల నుంచి డిమాండ్లు, ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్(Bangladesh) తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. ఈ  ఏడాది డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్య ఎప్పుడైనా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని ప్రకటించారు.

జపాన్‌ పర్యటనలో ఉన్న ముహమ్మద్ యూనస్ తాజాగా టోక్యోలో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో ఎన్నికల నిర్వహణలో రాజకీయ వర్గాలలో  అసహనం నెలకొన్నదని, ఎన్నికలు పూర్తయ్యాక, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, అప్పుడు వారికి తాము బాధ్యతలను అప్పగిస్తామని అన్నారు.  మరోవైపు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పాలని ప్రజలు పట్టుబడుతున్నారని, ఈ సంవత్సరం డిసెంబర్‌ నుంచి 2026 జూన్‌ మధ్యకాలంలో  ఎ‍న్నికలు నిర్వహించగలమన్నారు. ఎన్నికల సంస్కరణలు ఎంత త్వరగా చేయగలమనే దానిపై ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికల సంస్కరణలు(Electoral reforms) నెమ్మదిగా సాగితే ఎన్నికల నిర్వహణకు  అధిక సమయం పడుతుందన్నారు. 2026, జూన్ నాటికి  ఎన్నికలు నిర్వహించేవిధంగా పనిచేస్తున్నామన్నారు. మరోవైపు డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని ఢాకాతో సహా పలు నగరాల్లో బీఎన్‌పీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించింది. ఎన్నికల కాలక్రమాన్ని వాయిదా వేయవద్దని తాత్కాలిక ప్రభుత్వాన్ని బీఎన్‌పీ నేత తారిఖ్ రెహమాన్  కోరారు.

ఇది కూడా చదవండి: ముష్కరులకు దీటుగా బదులిచ్చాం: ప్రధాని మోదీ

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)