Breaking News

కెనడాలో టెంపుల్‌పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్‌

Published on Sun, 11/10/2024 - 16:12

కెనడాలోని గ్రేటర్ టొరంటో ఏరియా (GTA)లో గత ఆదివారం హిందూ టెంపుల్‌పై జరిగిన దాడికి సంబంధించిన కేసులో  ఖలిస్తానీ నిరసనల ప్రధాన నిర్వాహకుడు ఇందర్‌జీత్ గోసల్‌ పోలీసులు అరెస్టు చేశారు.  బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై హింసాత్మక దాడికి సంబంధించి శుక్రవారం అతన్ని అరెస్టు చేసి అభియోగాలు నమోదు చేసినట్లు పీల్ రీజినల్‌ పోలీసులు(PRP)  వెల్లడించారు. నిందితుడు ఖలీస్తానీ వేర్పాటువాద గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే.. అరెస్ట్‌ చేసిన  అనంతరం అతన్ని షరతులపై విడుదల చేశామని తెలిపారు. బ్రాంప్టన్‌లోని అంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో ముందస్తుగా పేర్కొన్న తేదీన హాజరుకావలసి ఉంటుందని అతనికి తెలియజేశారు. 

మరోవైపు.. టెంపుల్‌పై దాడి జరిగిన అనంతరం.. నవంబర్ 3, 4 తేదీల నుంచి చోటుచేసుకున్న సంఘటనలను పరిశీలించడానికి పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ  ఘటనపై  దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌పై జరిగిన దాడిపై ఇండో-కెనడియన్ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కెనడా అధ్యక్షుడు జస్టిస్‌ ట్రూడో, కెనడా ప్రతిపక్ష నాయకుడు పియరీ పోయిలీవ్రే తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.

ఎవరీ ఇందర్‌జీత్ గోసల్?
ఇందర్‌జీత్‌ గోసల్‌కు సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) జనరల్ కౌన్సెల్‌ గురుపత్వంత్ పన్నూకు  లెఫ్టినెంట్‌గా గుర్తింపు ఉంది. గతేడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు కెనడియన్ ఆర్గనైజర్‌గా నియమించబడ్డాడు. కెనడియన్ పోలీసుల ప్రకారం.. ఖలిస్థానీ గ్రూప్‌ పేరుతో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్న 13 మంది కెనడియన్లలో గోసల్ కూడా ఉన్నట్లు తెలిపారు.

చదవండి: ఉక్రెయిన్, పశ్చిమాసియాపై ఏం చేస్తారు?

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)