Breaking News

మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నాం

Published on Sat, 06/10/2023 - 06:33

వాషింగ్టన్‌:  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం తాము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. మోదీ పర్యటన భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త ఒరవడిని నిర్దేశిస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా రక్షణ సహకారం, భారత్‌లో స్వదేశీ రక్షణ రంగ పారిశ్రామిక ప్రగతి విషయంలో భారీ, చరిత్రాత్మక, ఉత్తేజభరిత ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటన ప్రారంభిస్తారు.

నాలుగు రోజులపాటు అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్‌ ఈ నెల 22న ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. అధ్యక్షుడిగా బైడెన్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. మోదీ రాకవల్ల భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి (ఇండో–పసిఫిక్‌ భద్రతా వ్యవహారాలు) ఎలీ రట్నార్‌ చెప్పారు. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక సందర్భం అవుతుందన్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)