Breaking News

ప్రధాని మోదీకి సుశీలా కర్కి ఫోన్‌

Published on Fri, 09/19/2025 - 06:18

కాఠ్మండు: నేపాల్‌ ఆపద్ధర్మ ప్రధానిగా ఇటీవల నియమితులైన సుశీలా కర్కి గురువారం ప్రధాని మోదీతో ఫోన్‌లో సంభాషించారు. ప్రాధాన్యతాంశాలను అమలు చేయడంలో ఆపద్ధర్మ ప్రభుత్వానికి తోడ్పాటునిస్తామని ఆమెకు మోదీ హామీ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టాక కర్కి ఒక విదేశీ ప్రభుత్వాధినేతకు చేసిన మొట్టమొదటి ఫోన్‌ కాల్‌ ఇదే కావడం గమనార్హం. 

సామాజిక మాధ్య మాలపై నిషేధంతోపాటు ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా యువత ఆధ్వర్యంలో జరిగిన జెన్‌ జడ్‌ నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో ప్రధాని కేపీ శర్మ ఓలి గద్దెదిగగా, కర్కి ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్య తలు చేపట్టడం తెల్సిందే. గురువారం ఫోన్‌ కాల్‌ సందర్భంగా నేపాల్‌కు మొట్టమొదటి మహిళా ప్రధాని గా బాధ్యతలు చేపట్టిన కర్కికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారని విదేశాంగ శాఖ తెలిపింది. ఎన్నికల నిర్వహణే తమ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంటుందని కర్కి తెలిపారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)