Breaking News

డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ కాల్‌

Published on Mon, 01/27/2025 - 20:52

ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌కు భారత ప్రధాని మోదీ ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

‘నా ప్రియమైన మిత్రుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది.  రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపా. మేము పరస్పర ప్రయోజనకరమైన, విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాము. మన ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు భద్రత కోసం కలిసి పని చేస్తాము’ అని పేర్కొన్నారు. 


డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం అమెరికన్లకు పెద్ద పీఠ వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా హెచ్‌1 బీ వీసా, అక్రమ వలసదారులపై  ఉక్కుపాదం మోపుతూ పలు ఆర్డర్‌లు జారీ చేశారు.

అమెరికాలో అక్రమంగా వలస వెళ్లే దేశాలలో  భారత్‌ సైతం ఉంది. ఇటీవలి కాలంలో పదివేల మంది భారతీయులు కెనడా, మెక్సికన్ సరిహద్దులు గుండా అమెరికాలో ప్రవేశించారు. వారిపై అమెరికా చర్యలకు ఉపక్రమించింది.  ఇదే అంశంపై అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి భారత్‌ తరుఫున హాజరైన భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు.

చట్ట విరుద్ధంగా, ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం, అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డ అక్రమ వలసదారుల్ని తిరిగి భారత్‌కు తీసుకువెళ్లేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’ అని అన్నారు. పత్రాలు లేని వలసదారుల (Undocumented immigrants)ల విషయంలో భారత్‌ వైఖరి స్థిరంగా ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు తెలిపారు.

భారత్‌ అక్రమ వలసలను గట్టిగా వ్యతిరేకిస్తోందని, ఇది మంచిది కాదని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ ప్రతిభ, భారతీయ నైపుణ్యాలు ప్రపంచ స్థాయిలో ఉపయోగపడడంతో పాటు అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టే అక్రమ వలస దారుల విషయంలో మా వైఖరి స్పష్టం ఉందని చెప్పారు.  

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)