‘ఇదే.. ప్రంబనన్ ఆలయ వైభవం’ : ప్రధాని మోదీ

Published on Wed, 07/08/2026 - 11:39

జోగ్‌జకర్తా (ఇండోనేషియా): ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడిక్కడ దాదాపు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రక ప్రంబనన్ హిందూ దేవాలయాల సముదాయానికి సంబంధించిన అద్భుతమైన వైమానిక దృశ్యాలను (ఏరియల్ వ్యూ) షేర్‌ చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాన్ని చూసి, ‘అద్భుతమైన ప్రంబనన్ ఆలయం!’ అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసించారు.

భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక సహాయంతో ఈ  ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టు అధికారిక ప్రారంభోత్సవానికి ముందు ఈ వైమానిక ప్రయాణం సాగింది. భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా ఇరు దేశాల సాంస్కృతిక దౌత్యంలో ఇదొక కీలక మైలురాయిగా నిలిచింది. మంగళవారం ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవోల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పరస్పరం మార్చుకున్నారు.
 

జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్ ఆలయ సముదాయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఆగ్నేయాసియాలో కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది. 9వ శతాబ్దంలో హిందూ మాతారామ్ రాజవంశానికి చెందిన రాజు రాకై పికాతన్ దీని నిర్మాణాన్ని ప్రారంభించగా, ఆయన వారసుడు లోకపాల పూర్తి చేశారు. ఇక్కడి శివ, విష్ణు, బ్రహ్మ ఆలయాలలో 47 మీటర్ల ఎత్తున్న ప్రధాన శివాలయం అత్యంత విశిష్టమైనది. ఈ ఆలయ గోడలపై చెక్కిన రామాయణ గాథ శిల్పాలు భారత్-ఇండోనేషియాల ప్రాచీన నాగరికత బంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)