యూకే ఎన్నిక‌ల్లో గెలిచిన‌ కైర్‌ స్టార్మర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్ష‌లు

Published on Fri, 07/05/2024 - 16:45

బ్రిటన్ పార్ల‌మెంట్ ఎన్నికల్లో విజ‌యం సాధించిన‌ లేబర్‌పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.  ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖతాలో ఒక పోస్ట్‌ పెట్టారు.

‘యూకే సార్వత్రిక ఎన్నికలలో అపూర్వ‌ విజయం సాధించిన కీర్ స్టార్మ‌ర్‌కు హృదయపూర్వక అభినందనలు. భార‌త్‌-యూకే మ‌ధ్య‌ పరస్పర వృద్ధి, శ్రేయస్సును పెంపొందిస్తూ అన్ని రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీ  సానుకూల, నిర్మాణాత్మక సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను.’ అని పేర్కొన్నారు.

అదేవిధంగా ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నేత, బ్రిట‌న్ ప్రధాని రిషి సునాక్‌కు సైతం మోదీ త‌న సందేశాన్ని అదించారు. సునాక్ అద్బుత‌మైన నాయ‌క‌త్వం, భార‌త్‌-యూకే సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌డంలో ఆయ‌న చేసిన కృషికి ప్ర‌ధాని ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కాగా యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్‌ను ఏలిన కన్జర్వేటివ్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్‌ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)