Breaking News

ఫ్రెంచ్ అధ్యక్షుడి భార్యపై ట్రోల్స్.. జైలుశిక్ష

Published on Mon, 01/05/2026 - 20:05

పారిస్‌: ఫ్రెంచ్ అధ్యక్షుడి సతీమణిని ట్రోల్ చేసినందుకు గాను అక్కడి పారిస్ కోర్టు పదిమందికి జైలుశిక్ష విధించింది. బ్రిగెట్టి మేక్రాన్‌ పురుషుడు అంటూ కొంతమంది ఆన్‌లైన్‌లో వేదింపులకు గురిచేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేయగా  తాజాగా ఆకేసును విచారించిన పారిస్ కోర్టు వారికి శిక్ష విధిస్తూ తీర్పుఇచ్చింది.

ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్య బ్రిగిట్టే మాక్రాన్‌ను 2024లో కొంతమంది ఆకతాయిలు ఆన్‌లైన్‌లో ట్రోల్‌ చేశారు. వాస్తవానికి బ్రిగిట్టే మాక్రాన్ పురుషుడని ఆయన అసలు పేరు జీన్- మిచెల్-ట్రోగిక్స్ అని ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్‌పై కలత చెందిన మాక్రాన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పుకార్ల వల్ల తమ కుటుంబం ఎంతో బాధపడిందని ఆమె కుమార్తె తెలిపింది.

తాజాగా దీనిపై విచారించిన కోర్డు నిందితులు పదిమందికి ఎనిమిది నెలల జైలుశిక్షతో పాటు రూ. 63 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే వీరిలో కొంతమంది తాము కేవలం సరదాకు మాత్రమే అలా అన్నామని అనగా.. దేశ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబం గురించి చేసిన  అనుచిత వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని న్యాయమూర్తి వారిని హెచ్చరించారు.

అమెరికాలో కూడా ట్రంప్ అనుకూల జర్నలిస్టులు కాండేస్ ఓవెన్స్, టక్కర్ గ్రావెన్స్ అనే ఇద్దరు జర్నలిస్టులు బ్రిగిట్టే మాక్రాన్ పురుషుడే అని వ్యాఖ్యలు చేశారు. బ్రిగిట్టే తన సోదరుడు జీన్-మిచెల్-ట్రోగన్స్ వాస్తవానికి ఒక్కరేనని మిచెల్ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని బ్రిగిట్టేగా మారిందన్నారు.  అయితే ఇవన్ని అసత్యపుకార్లని చాలా మంది కొట్టిపారేశారు.

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)