Breaking News

ఎవరైనా చార్జీలు  చెల్లించాల్సిందే 

Published on Fri, 02/07/2025 - 05:32

పనామా సిటీ:  పనామా కాలువ నుంచి అమెరికా యుద్ధనౌకలు ఉచితంగా రాకపోకలు సాగించేలా ఒప్పందం ఏదీ కుదరలేదని పనామా అధ్యక్షుడు జోస్‌రాల్‌ ములినో గురువారం స్పష్టంచేశారు. తమ యుద్ధ నౌకల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పనామాతో ఒప్పందం కుదిరిందంటూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. పనామా కాలువ గుండా రాకపోకలు సాగించే నౌకలకు రుసుము ఖరారు చేయడం గానీ, మినహాయింపు ఇవ్వడం గానీ తాను చేయలేనని పేర్కొన్నారు. 

అమెరికా నౌకలకు ప్రత్యేక వెసులుబాటు లేదని వివరించారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అన్ని దేశాల నౌకలు రుసుము చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సెత్‌కు తెలియజేశానని చెప్పారు. అయితే, పనామా అధ్యక్షుడు జోస్‌రాల్‌ ములినో అమెరికా సర్కారు ఇంకా స్పందించలేదు. ‘‘అమెరికా ప్రభుత్వ నౌకలు ఇకపై పనామా కాలువలో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చు. దీనివల్ల మనకు మిలియన్‌ డాలర్ల ఆదా అవుతుంది’’అని అమెరికా బుధవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)