వాళ్లను చంపేయండి.. ఇజ్రాయెల్‌కు గాజా ప్రజల విన్నపం!

Published on Mon, 01/15/2024 - 16:16

టెల్‌ అవివ్‌: గాజాలో ఇజ్రాయెల్‌ సేనలు దాడులు కొనసాగిస్తునే ఉన్నారు. గాజా- ఇజ్రాయెల్‌ మధ్య దాడులు మొదలై 100 వంద  రోజులు పూర్తి అయింది. అయినా ఇజ్రాయెల్‌ గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తునే ఉంది. హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ దేశ అర్మీ.. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌(ఐడీఎఫ్‌) తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. 

ఆ వీడియోలో.. హమాస్‌ మిలిటెంట్లపై పాలస్తీనియా ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘హమాస్‌ నేతలు కుక్కలతో సమానం. వారిని అల్లా క్షమించడు. హమాస్‌ నేతల వల్లనే తమకు ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని వారు 100 ఏళ్ల వెనక్కి నెట్టారు. సాయుధ బలంతో హమాస్‌ నేతలు విర్రవీగుతున్నారు.

హమాస్‌ నేతలు గాజాలో లేరు. వారంతా పాలస్తీనా విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. కావాలంటే హమాస్‌ బలగాలను పాలస్తీనా వెలుపల చంపండి. కానీ, గాజాలోని పాలస్తీనా ప్రజలపై దాడులు చేయకండి’’ అని గాజాలోని పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్‌ సైనిక అధికారులతో మొర పెట్టుకున్నారు. 

ఇప్పటివరకు 23,968 మంది పాలస్తీనియా ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇక.. అక్టోబర్‌ 7న హమాస్‌ సాయుధులు చేసిన మెరుపు దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన 1200 మంది మృతి చెందారు. హమాస్‌ నేతల చేతిలో ఇంకా 136 మంది ఇజ్రాయెల్‌ బంధీలు ఉన్న విషమం తెలిసిందే.

తమ బంధీలు, హమాస్‌ బలగాలకు సంబంధిచిన నేతల జాడ తెలిస్తే చెప్పాలని పాలస్తీనా ప్రజలను ఐడీఎఫ్‌ కోరుతోంది. హమాస్‌ నేతల జాడ తెలియజేసిన వారికి 4 లక్షల అమెరికన్‌ డాలర్లను రివార్డుగా అందిస్తామని ఐడీఎఫ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి:  ఏలియన్‌ మమ్మీల గుట్టు రట్టు.. అసలు కథేంటంటే..

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)