Breaking News

పాక్‌ కుర్రోడి సాయానికి కెనడా యువతి ఫిదా.. తరువాత జరిగిందిదే!

Published on Sat, 07/22/2023 - 14:02

ప్రేమకు బాషాబేధాలు అడ్డుకావంటారు. ప్రేమ అనేది ఏ ఇద్దరి మధ్య ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేమని కూడా అంటారు. ప్లంబర్‌గా పనిచేసే ఒక పాకిస్తాన్‌ యువకుని విషయంలో ఇదే జరిగింది. 

వివరాల్లోకి వెళితే 26 ఏళ్ల పాకిస్తాన్‌ యువకుడు ముకర్రమ్‌ ఎంజాయ్‌ చేసేందుకు థాయ్‌లాండ్‌ వెళ్లాడు. అక్కడ కెనడాకు చెందిన ఒక యువతి ఏదో ఇబ్బంది పడుతూ అతనికి కనిపించింది. దీంతో ముకర్రమ్‌ ఆమెను సమస్య ఏమిటని అడిగాడు. దీనికి ఆమె తన ఫోను పాడయ్యిందని తెలిపింది. అలాగే తాను బ్రెజిల్‌ వెళ్లాలని, దానికి సంబంధించిన ఫ్లయిట్‌ టిక్కెట్‌ ఆ ఫోనులోనే ఉన్నదని తెలిపింది. ఆమె సమస్యను గ్రహంచిన ముకర్రమ్‌ ఆమెకు తన ఫోన్‌ ఇవ్వడమే కాకుండా, బ్రెజిల్‌ వెళ్లేందుకు ఫ్లయిట్‌ టిక్కెట్‌ కూడా కొనుగోలు చేసి ఆమెకు ఇచ్చాడు. అది మొదలు ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. అది వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది.

పాకిస్తాన్‌ పాడ్‌కాస్ట్‌ ఛానల్‌ డెయిలీ పాకిస్తాన్‌ గ్లోబుల్‌ తెలిపిన వివరాల ప్రకారం ముకర్రమ్‌ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. అతనిని వివాహం చేసుకునేందుకు కెనడా నుంచి పాకిస్తాన్‌కు ఒక యవతి వచ్చింది. ముకర్రమ్‌ గత ఏడాది డిసెంబరు 6న ఎంజాయ్‌ చేసేందుకు థాయ్‌లాండ్‌ వెళ్లాడు. అక్కడ ముకర్రమ్‌ కెనడాకు చెందిన యువతికి సాయం అందించాడు. బ్రెజిల్‌ చేరుకున్న ఆ యువతి ముకర్రమ్‌కు ధన్యవాదాలు తెలిపింది. తరువాత వారిద్దరి మధ్య ఫోను సంభాషణల ద్వారా స్నేహం ఏర్పడి అది ప్రేమగా పరిణమించింది. కొద్ది రోజుల క్రితమే వారిద్దరూ వివాహం చేసుకున్నారు.  

ఒక ఇంటర్యూలో ముకర్రమ్‌ మాట్లాడుతూ థాయ్‌ల్యాండ్‌లో ఆమె బాధపడుతుందటం చూసి, తన ఫోను ఇచ్చానని, దీనిలో ఎటువంటి దురుద్దేశం లేదన్నాడు. కెనడా యువతి మాట్లాడుతూ తాను అర్జెంటీనాలో పుట్టానని, ఎంజాయ్‌ చేసేందుకు థాయ్‌లాండ్‌ వెళ్ళగా,అక్కడ ముకర్రమ్‌ పరిచయమయ్యాడన్నారు.   
ఇది కూడా చదవండి: ‘కాకి ఇలా కూడా చేస్తుందా?’.. ఇంతకుముందెన్నడూ చూడని స్ఫూర్తిదాయక వీడియో!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)