Breaking News

వారి కలయికతో చిక్కుల్లో ఆర్మీ చీఫ్‌ మునీర్‌..!

Published on Wed, 12/31/2025 - 17:29

పాక్‌లోకి చొరబడి... దాక్కుని ఉన్న టెర్రరిస్టులను భారత్‌ హతమార్చలేదా? అనేది ప్రశ్న... సాధారణంగా ఈ ప్రశ్నను ఎవరు అడుగుతారు?  ఎవరో భారతీయుడు అడిగి ఉంటాడని మనం అనుకుంటాం. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్‌కు చెందిన ఓ మతపెద్ద...జమీయతే ఉలేమా ఇస్లాం చీఫ్‌మౌలానా ఫజలుర్రహ్మన్‌ .. కరాచీలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..ఈ ప్రశ్నను అడగడం...గమనార్హం. ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే... వాస్తవంగా ఆఫ్ఘనిస్థాన్‌పై.. దేశం లోపలకి ప్రవేశించి పాక్‌ ఆర్మీ వరసగా దాడులకు పాల్పడుతోంది. 

ఆ దాడులను ఖండిస్తూ... ఇతర దేశాలపై దాడులు చేయడం సమంజసం కాదని... ఒకవేళ అది సరైన నిర్ణయమే అని పాకిస్తాన్‌ భావిస్తే... మరి భారత్‌ ఇక్కడికి వచ్చి దాడులు చేయడం కూడా సబబే కదా అని ఆయన సభను ఉద్దేశించి చెప్పారు. ఆఫ్గనిస్తాన్‌పై పాక్‌ దాడులు ఆపాలని... చర్చలు జరపాలని ఆయన అన్నారు. అయితే దాడులకు మూలకారకుడిగా ఉన్న పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్ లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులను నివారించి... పాకిస్తాన్‌... ఆఫ్గనిస్తాన్‌ల మధ్య సయోధ్య కుదర్చడానికి... ఇరు దేశాల మతపెద్దలు ఏకమవుతామని కూడా ఆయన ప్రకటించారు. 

పాక్‌లో జరిగిన బహిరంగ సభలో పెద్దల మాటలను ఆఫ్గాన్‌లోని తాలిబాన్‌ మతపెద్దలు ఆహ్వనించారు. ఇది మంచి సంకేతమని... దాడులకు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఆసిమ్‌ మునీర్‌ ఆటలకు అడ్డుకట్ట వేయడానికి ఆ రెండు దేశాల మత పెద్దలు సిద్ధమయ్యారు. ఆ పెద్దల నిర్ణయం... అటు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ జనగరల్‌ ఆసిమ్‌ మునీర్‌లకు చిక్కుల్లోకి నెట్టింది. ముఖ్యంగా ఆసిమ్‌ మునీర్‌ గేమ్‌ చివరి దశకు చేరిందని... ఖేల్‌ ఖతమ్‌ అని అక్కడి పత్రికలు రాయడం కూడా ప్రారంభించాయి. అక్కడ అసలేం జరుగుతోందో... జరగబోతుందో...  ఇప్పుడు మనం చూద్దాం.

ఇరు దేశాల మతపెద్దల కలయిక ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు పెద్ద చిక్కుల్లోనే నెట్టింది. పాకిస్తాన్‌- ఆఫ్గాన్‌ల మధ్య చెలరేగిన వివాదాలకు మతపెద్దలు ఆపే ప్రయత్నం చేస్తున్నారని... అసిమ్‌ మునీర్‌ లక్ష్యంగా సాగుతున్న ఈ మతపెద్దల కలయిక మునీర్‌కు పెద్ద ఇరకాటంలో నెట్టనుంది. తాలిబాన్‌ పెద్దలు, పాకిస్తాన్‌ మత పెద్దల సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఆ పెద్దలు కలిసి దాడులను ఆపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసిమ్‌ మునీర్‌ అనవసరంగా ఆఫ్గాన్‌పై దాడులు చేయిస్తున్నారని.. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను కూడా చెడగొడుతోందన్నారు. ఇరు దేశాలకు నష్టాల పాలు చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని పెద్దలు హుకుం జారీ చేశారు. 

 ఫజలుర్‌ రహ్మాన్‌ వ్యాఖ్యలు ఆఫ్గనిస్తాన్‌లో సంబరాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు తాలిబాన్‌ ప్రభుత్వ అంతర్గత శాఖల మంత్రి సిరాజుద్దీన్‌... పాక్‌ మతపెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మెట్టు దిగిన పాక్‌ ప్రభుత్వం మతపెద్దల శాంతి రాయబారాన్ని స్వాగతిస్తున్నామని... ఆఫ్గన్‌పై దాడులు నిలిపివేస్తామని డిప్యూటి ప్రధాన మంత్రి ఇషాక్‌ దార్‌ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని... ఆర్మీని వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చారు. అసలు దాడుల ఆలోచనే లేదు... ఇక దాడుల పేరిట ఆఫ్గనిస్తాన్‌పై అరాచకం సృష్టించిన ఆర్మీ చీఫ్‌ మునీర్‌ మాత్రం నోరు విప్పడం లేదు. 
-మహమ్మద్ అబ్దుల్ ఖదీర్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)