Breaking News

ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌..వాటిని పునరుద్ధరించమని యూఎస్‌కి విజ‍్క్షప్తి!

Published on Sat, 04/29/2023 - 09:28

అఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలు వైదొలగినప్పటి నుంచి పాక్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల సంబంధాలు సుదీర్ఘకాలం అనిశ్చితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగదు కొరతతో సతమవుతున్న పాక్‌ మిలటరీ ఫైనాన్సింగ్‌ సేల్స్‌ను పునరుద్ధరించాలని అమెరికాని కోరింది. వాస్తవానికి దీన్ని యూఎస్‌ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్‌లో జరిగిన సెమినార్‌లో అమెరికాకు చెందిన పాకిస్తాన్‌ రాయబారి మసూద్‌ ఖాన్‌ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన దానిని పునరుద్ధరించాలన్నారు. విదేశీ మిలిటరీ ఫైనాన్సింగ్‌, ఫారిన్‌​ మిలటరీ సేల్స్‌ను పునరుద్ధరించడం పాక్‌కి చాలా ముఖ్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ మధ్య ఆసియా యూఎస్‌ ప్రిన్సిపల్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ఎలిజబెత్‌ హూర్ట్స్‌ సమస్యత్మకంగా మారిన పాక్‌ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంలో సహాయం చేయాల్సిన అవసరంపై దృష్టి సారించారు. ఐతే ముందు పాక్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌)తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు ఎలిజబెత్‌. పాక్‌ ఐఎంఎఫ్‌తో అంగీకరించిన కఠినమైన సంస్కరణలు అంత తేలికైనవి కాదన్నారు.

కానీ పాక్‌ తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలన్న, మరింత అప్పుల ఊబిలో చిక్కుకోకుండా తన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పాక్‌కి ఈ చర్యలు తీసుకోవడం చాలా కీలకమని చెప్పారు. అందువల్ల ఐఎంఎఫ్‌తో అంగీకరించిన సంస్కరణలను పాక్‌ ముందుగా అమలు చేయాలని యూఎస్‌ కోరింది. ఈ మేరకు పాక్‌ అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవడంపై దృష్టి సారించింది. ఆ సమావేశంలో రాయబారి ఖాన్‌  రష్యా చమురు కోసం పాక్‌ తన మొదటి ఆర్డర్‌ ఇచ్చిందని కానీ యూఎస్‌తో సంప్రదించి వెనక్కి తగ్గినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఖాన్‌ అఫ్ఘనిస్తాన్‌లో సుస్థిరత తీసుకురావడంలో పాక్‌ పోషించిన కీలక పాత గురించి మాట్లాడారు.

గత నాలుగు దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘాన్‌లోని ప్రజలకు స్థిరత్వం చాలా అవసరం అని ఖాన్‌ పేర్కొన్నారు. అలాగే అఫ్ఘనిస్తాన్‌లో వృద్ధి చెందుతున్న ఉగ్రవాదంపై అమెరికా, చైనాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఈ రోజు అది పాక్‌, అఫ్ఘాన్‌లకు ముప్పుగా ఉండోచ్చు కానీ దీన్ని అదుపు చేయకపోతే మరింతగా విస్తరిస్తుందని హెచ్చరించారు. ఈ ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం అని రాయబారి ఖాన్‌ పిలుపునిచ్చారు. 

(చదవండి: సూడాన్‌ నుంచి మరో 754 మంది రాక)

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)