Breaking News

తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!

Published on Fri, 04/25/2025 - 15:34

భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ సింధు నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడం, అందుకు బదులుగా 1972 నాటి సిమ్లా అగ్రిమెంటు అమలును పాక్ సస్పెండ్ చేయడం తెలిసిందే. తాష్కెంట్ ఒప్పందం నుంచి కూడా వైదొలగాలని పాక్ తాజాగా యోచిస్తోంది. 1965లో ఇండియాతో తలెత్తిన యుద్ధానికి ముగింపు పలికేందుకు పాక్ 1966లో తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్) శాంతి ఒప్పందానికి తలూపింది. నాటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో 1966 జనవరి 10న తాష్కెంట్ వేదికగా భారత్, పాక్ మధ్య ఈ చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. 

నాటి భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు మహమ్మద్  ఆయూబ్ ఖాన్ ఈ డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. నాటి సోవియట్ రాజకీయవేత్త అలెక్సీ కోసిజిన్ ఈ కార్యక్రమానికి సోవియట్ ప్రతినిధిగా హాజరయ్యారు. భారత్, పాక్ ఇరు దేశాలూ తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుని వాటిని యుద్ధానికి ముందు నాటి స్థానాలకు మళ్లించడం, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో రెండో దేశం జోక్యం చేసుకోకుండా నివారించడంతోపాటు దౌత్య, ఆర్ధిక సంబంధాలను పునరుద్ధరించడం వంటివి ఈ డిక్లరేషన్ ప్రధానాంశాలు. 

అయితే కశ్మీర్ వివాద పరిష్కారంలో తాష్కెంట్ ఒప్పందం విఫలమైంది. 1971లో భారత్, పాక్ నడుమ మరో యుద్ధం సంభవించడం, బంగ్లాదేశ్ అవతరణ పరిణామాలతో 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. అలా కశ్మీర్లో నియంత్రణ రేఖ ఏర్పాటైంది. అప్పట్నుంచి భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో సిమ్లా అగ్రిమెంటుకు ప్రాధాన్యం పెరగడంతో తాష్కెంట్ ఒప్పందం కొన్ని దశాబ్దాలుగా మరుగునపడింది. సిమ్లా అగ్రిమెంటుకే విలువ ఇవ్వకుండా పక్కకు తప్పుకున్న పాక్ తాజాగా ఆరు దశాబ్దాల నాటి తాష్కెంట్ ఒప్పందం నుంచి వైదొలగాలని యోచించడం పెద్ద విశేషమేమీ కాదు. 

కాకపొతే పాక్ వైఖరిని గమనించడానికి ఇదొక ఉదాహరణ. చారిత్రకంగా ప్రాధాన్యమున్న శాంతిపరమైన బాధ్యతలను నెరవేర్చకుండా తప్పుకోవడం, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా రచ్చ చేయాలని చూడటం వంటివి పాక్ వ్యూహాలుగా కనిపిస్తున్నాయి. ఇకపై కశ్మీర్ వివాదం ద్వైపాక్షికం కాదని వాదిస్తూనే, ఆ సమస్య పరిష్కారం కోసం తృతీయ పక్షం లేదా అంతర్జాతీయ జోక్యానికి పిలుపు ఇవ్వాలని పాక్ భావిస్తోంది. ఇందులో భాగమే తాష్కెంట్ ఒప్పందానికి పాక్ చెల్లుచీటీ! 
-  జమ్ముల శ్రీకాంత్.

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)