Breaking News

అంతర్జాతీయ వేదికపై పాక్‌ పరువు పాయే!

Published on Tue, 07/21/2026 - 09:05

న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)పై కెనడా విదేశాంగ మంత్రితో పాకిస్తాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఐడబ్ల్యూటీతో పాటు, కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కెనడాను కోరారు. అయితే కెనడా విదేశాంగ మంత్రితో జరిగిన ఈ సమావేశం అనంతరం ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో సింధు జలాల ఒప్పందం గానీ, కశ్మీర్ అంశం గానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.

అంతర్జాతీయ వేదికలపై నిత్యం భారత్‌పై నిందలు మోపే పాకిస్తాన్ ప్రయత్నాలకు కెనడాలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెనడా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆ దేశ విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని, దీనిపై అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కశ్మీర్ వివాదంలోనూ మధ్యవర్తిత్వం వహించాలని కోరినట్లు సమాచారం.

అయితే, దౌత్య సంబంధాల పరంగా పాక్ అభ్యర్థనలను కెనడా పెద్దగా పట్టించుకోలేదని స్పష్టమైంది. భేటీ ముగిసిన తర్వాత విడుదల చేసిన అధికారిక సంయుక్త ప్రకటనలో కశ్మీర్, సింధు జలాల వివాదం గురించి కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. దీంతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మరోమారు పరువు తీసుకున్నట్లయ్యింది.

ఇది కూడా చదవండి: అభిషేక్ బెనర్జీకి హైకోర్టు షాక్‌ .. కంటి చికిత్సకు సలహా!
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)