Breaking News

పాక్‌లో కొత్తగా  ఆర్మీ రాకెట్‌ ఫోర్స్‌ 

Published on Fri, 08/15/2025 - 04:10

ఇస్లామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ భారత క్షిపణుల ధాటికి పూర్తిగా చేతులెత్తేసిన పాకిస్తాన్‌కు నెమ్మదిగా తత్వం బోధపడింది. దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసుకోవాలని ఎట్టకేలకు నిర్ణయించుకుంది. అందులోభాగంగా నూతనంగా ఆర్మీ రాకెట్‌ ఫోర్స్‌ కమాండ్‌ పేరిట నూతన విభాగాన్ని ఏర్పాటుచేసుకుంటోంది. 

పాక్‌ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. సంప్రదాయక యుద్ధ సామర్థ్యాలను మెరుగుపర్చుకునే లక్ష్యంతో ఈ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న ట్లు పాక్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ, త్రివిధ దళాధిపతుల సమక్షంలో షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు.

 భూతలం నుంచి ప్రయోగించే అణు, అణ్వస్త్రయేతర బాలిస్టిక్, హైపర్‌సోనిక్, క్రూయిజ్‌ క్షిపణులతో ఈ కొత్త ఆర్మీ రాకెట్‌ ఫోర్స్‌ కమాండ్‌ను తీర్చిది ద్దనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ తన క్షిపణుల సత్తాను పాక్‌కు రుచి చూపించాక ఎట్టకేలకు పాక్‌ ప్రభుత్వం మేల్కొంది. 2025– 2026 ఆర్థిక సంవత్సరంలో రక్షణరంగ బడ్జెట్‌ను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.   

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)