శాంతి నోబెల్‌కు ట్రంప్‌

Published on Thu, 06/26/2025 - 05:58

వాషింగ్టన్‌: నోబెల్‌ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్‌ ఆశలు మళ్లీ చిగురించాయి. ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలంటూ పాకిస్తాన్‌ ప్రభుత్వం నార్వేకు సిఫార్సుచేసింది. ఈ మేరకు నామినేట్‌ చేస్తున్నట్లు పాక్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తమ నాయకుడు నోబెల్‌ అవార్డ్‌కు తగిన వ్యక్తి అని అమెరికా కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ సభ్యుడు, జార్జియా నుంచి రిపబ్లికన్‌ పార్టీ నేత బడ్డీ కార్టర్‌ వ్యాఖ్యానించారు. 

ఈయన సైతం ట్రంప్‌ పేరును నామినేట్‌ చేస్తూ నార్వేలోని శాంతి బహుమతి కమిటీకి లేఖ రాశారు. ‘‘ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధాన్ని ట్రంప్‌ ఒంటిచేత్తో ఆపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇరాన్‌ అణుబాంబును సాధించకుండా ట్రంప్‌ సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అసాధ్యమని అంతా భావించిన వేళ ట్రంప్‌ దానిని సాధించి చూపించారు. సమర సంక్షోభం సమసిపోయేలా ఎంతో సమర్థవంతంగా వ్యవహరించిన ట్రంప్‌ ఈసారి నోబెల్‌ శాంతి బహుమతికి అర్హుడు. 

శాంతిస్థాపన, యుద్ధ విరమణ, అంతర్జాతీయ సామరస్యాల సాధనకు కృషిచేసినందుకు ట్రంప్‌ నోబెల్‌ ఇవ్వాల్సిందే’’అని బడ్డీ కార్టర్‌ తన లేఖలో రాశారు. ‘‘భారత్, పాకిస్తాన్‌ మధ్య పరస్పర సైనిక చర్యలు ఆపడంలో ట్రంప్‌ సఫలీకృతులయ్యారు. దౌత్య జోక్యం ద్వారా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించారు. ఈ విషయంలో ట్రంప్‌ నిజంగా శాంతికాముకుడు’’అని పాకిస్తాన్‌ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. అయితే గతంలో ట్రంప్‌ను నామినేట్‌ చేస్తూ లేఖ రాసిన ఉక్రెయిన్‌ విదేశీవ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ ఒలెగ్జాండర్‌ మరెజ్కో తన ట్రంప్‌ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. 

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)