Breaking News

అదే జరిగితే ఆఫ్ఘనిస్థాన్‌తో యుద్దమే.. పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 10/26/2025 - 11:26

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు.. ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా పాక్‌ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల్లో ఒప్పందం కుదరకపోతే బహిరంగ యుద్దమే అని కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.

తాజాగా పాక్‌ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్‌ శాంతిని కోరుకుంటుందనే విశ్వాసం ఉంది. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే వాళ్లతో బహిరంగ యుద్ధం చేస్తాం. అందుకు మాకు ఓ అవకాశం ఉంది. కానీ, వాళ్లు శాంతిని కోరుకుంటారని విశ్వసిస్తున్నా. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాయని అనుకుంటున్నా. గత నాలుగైదు రోజులుగా సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి’ అని అన్నారు. అయితే, ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ ఆసిఫ్‌ ఈ విధంగా స్పందించారు.

ఆసిఫ్‌కు కౌంటర్‌.. 
మరోవైపు.. మహమ్మద్‌ ఆసిఫ్‌ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ మంత్రి, క్వామి వతన్ పార్టీ అధినేత అఫ్తాబ్ షెర్పావ్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా అఫ్తాబ్‌ స్పందిస్తూ..‘ఆసిఫ్ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం. ప్రభుత్వ సీనియర్ మంత్రి నుండి ఇటువంటి వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల ప్రక్రియను దెబ్బతీస్తాయి.  చర్చల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దశాబ్దాల సంఘర్షణలో అధికారులు శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన భవిష్యత్తును నిర్ధారిస్తారు’ అని కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఖతార్‌, తుర్కియే మధ్యవర్తిత్వంతో దోహా వేదికగా రెండోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. కాగా, అక్టోబర్‌  18,19 తేదీల్లో  జరిగిన మొదటి చర్చల్లో పా​కిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ క్రమంలోనే శనివారం ఇస్తాంబుల్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఆదివారం కూడా చర్చలు కొనసాగుతున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)