Breaking News

పాక్‌లో సత్తా చాటుతున్న మహిళా నేతలు వీరే!

Published on Wed, 01/03/2024 - 11:25

పాకిస్తాన్‌లో 2024 ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. జైల్లో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ నామినేషన్‌పై ఓ వైపు చర్చ జరుగుతుండగా, మరోవైపు తొలిసారిగా హిందూ మహిళ డాక్టర్ సవీరా ప్రకాష్ ఎన్నికల రంగంలోకి దిగడం కూడా ఉత్కంఠ రేపుతోంది. పురుషాధిక్య పాకిస్తాన్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కొందరు మహిళా నేతలు కూడా ఉన్నారు. వారెవరో.. వారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మరియమ్ నవాజ్: 
పాకిస్తాన్ రాజకీయాల్లో అగ్రశ్రేణి మహిళా రాజకీయ నేతలలో మరియమ్ నవాజ్ పేరు ముందుగా వినిపిస్తుంది. ఆమె పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, కుల్సూమ్ నవాజ్‌ల కుమార్తె. ఆమె తన తండ్రితో పాటు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. 

ఆయలా మాలిక్: 
ఇమ్రాన్ ఖాన్ ప్రచార నిర్వాహకురాలు ఆయలా. ఈమె మామ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు సర్దార్ ఫరూక్ అహ్మద్ ఖాన్ లెఘారీ. ఆయలా సోదరి సుమైరా మాలిక్ కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 

అలీజ్ ఇక్బాల్:
పాకిస్తాన్ మాజీ ఎంపీ అలీజ్ ఇక్బాల్ హైదర్ అక్కడి ప్రముఖ మహిళా నేతల్లో ఒకరు. అలీజ్ తండ్రి ఇక్బాల్ హైదర్ చట్టసభ సభ్యుడు. అలీజ్.. బిలావల్ భుట్టో జర్దారీకి ప్రతినిధిగా కూడా ఉన్నారు.

షాజియా మేరీ: 
పాక్‌ మహిళా నేతలలో షాజియా మేరీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. షాజియా మేరీ సింధీ బలూచ్ పాకిస్తాన్ రాజకీయనేత. ఆమె 2002లో సింధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

హీనా రబ్బానీ ఖర్:
పాక్‌కు చెందిన మహిళా నేత హీనా రబ్బానీ ఖర్ తన ప్రత్యేక ప్రసంగాలతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. హీనా రబ్బానీ ఖర్ 2011- 2013 మధ్య కాలంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు.

కష్మలా తారిక్:
కష్మలా తారిక్ పాక్‌లో మహిళల రక్షణకు పాటుపడుతున్నారు. ఆమె 2018 నుండి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. కష్మలా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలు.

షర్మిలా ఫారూఖీ
పాక్‌ రాజకీయాలపై లోతైన అవగాహన కలిగిన మహిళా నేతగా షర్మిలా ఫారూఖీ పేరొందారు. ప్రస్తుతం షర్మిల పాకిస్తాన్‌లోని సింధ్ ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నారు.

మార్వి మెమన్: 
మార్వి మెమన్ ప్రస్తుతం బెనజీర్ ఇన్‌కమ్ సపోర్ట్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగానూ పేరొందారు. 

హీనా పర్వేజ్ బట్ 
హీనా పర్వేజ్ బట్ తరచూ ప్రజల మధ్య తిరుగుతూ ఉత్తమ నేతగా పేరు తెచ్చుకున్నారు. హీనా.. లాహోర్ విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్‌మెడల్‌ సాధించారు. 

సుమైరా మాలిక్ 
మానవ హక్కుల కార్యకర్తగా సుమైరా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. పాక్‌ మహిళల అభిమానాన్ని సుమైరా చూరగొన్నారు. 
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)