Breaking News

‘పాక్‌’ ఫలితాల మధ్య ఇమ్రాన్‌ ‘విక్టరీ స్పీచ్‌’

Published on Sat, 02/10/2024 - 08:15

పాకిస్తాన్‌లో ఏ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడబోతున్నదనే దానిపై సస్పెన్స్‌ నెలకొంది. అటు ఇమ్రాన్‌ఖాన్‌..  ఇటు నవాజ్‌ షరీఫ్‌ విజయం తమదేనని చెబుతున్నారు. ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంపై పాకిస్తాన్ ఎన్నికల సంఘంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాక్‌ మాజీ ప్రధాని, ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (సీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్  ఏఐ ఆధారిత ‘విక్టరీ స్పీచ్‌’ను విడుదల చేశారు. ఈ ప్రసంగంలో ఆయన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్’ (పిఎంఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ ‘లండన్ ప్లాన్’ విఫలమైందని, పోలింగ్ రోజున ఓటర్లు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారని ఇమ్రాన్ పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో ‘నా ప్రియమైన దేశప్రజలారా.. ఇంత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని, మీ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారు. పౌర స్వేచ్ఛను పునరుద్ధరించడానికి మీరు పునాది వేశారు. నేను కూడా ఓటు వేశాను. ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించేందుకు మీరు సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నా నమ్మకాన్ని నిలబెట్టారు. ఎన్నికల్లో భారీ ఓటింగ్ చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. మీరంతా ప్రజాస్వామ్య కసరత్తులో చురుకుగా పాల్గొనడం వల్ల ‘లండన్ ప్లాన్’ విఫలమైంది’ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఇమ్రాన్‌ జైలులో ఉన్నా.. పాక్‌ యువత ఎందుకు మద్దతు పలికింది?

Videos

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు