Breaking News

పాక్‌ ఎన్నికలకు 54 వేల చెట్ల నరికివేత!

Published on Tue, 02/06/2024 - 13:02

ఇస్లామాబాద్‌: ఇదేందిది... ఎన్నికలకోసం చెట్లు నరకడం ఏమిటా అనుకుంటున్నారా? అవును ఇది ఇది నిజం.. పాక్‌ ఎన్నికల నిర్వహణకు 56 వేల చెట్లు నరికి వేయాల్సి వచ్చింది. పాక్‌లో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల కోసం మొత్తంగా 26 కోట్ల బ్యాలెట్‌ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 2,179 టన్నుల కాగితం అవసరమయ్యింది. కాగితాన్ని చెట్ల నుంచే తయారు చేస్తారనే విషయం మనకు తెలిసిందే. 

ఒక అంచనా ప్రకారం ఒక చెట్టు నుండి దాదాపు 16 రీమ్‌ల కాగితాన్ని తయారు చేయవచ్చు. అటువంటి స్థితిలో ఒక టన్ను కాగితం తయారు చేయడానికి 25 చెట్లు అవసరం. దాని ప్రకారం మనం లెక్కలు వేస్తే ఎన్నికల కోసం పాకిస్తాన్‌లో దాదాపు 54 వేల చెట్లను నరికివేశారు. 2018 ఎన్నికల్లో 22 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 800 టన్నుల ప్రత్యేక సెక్యూరిటీ పేపర్‌ను ఉపయోగించారు. 

నియోజక వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య పెరిగిన కారణంగానే బ్యాలెట్ పేపర్ల సంఖ్య పెరిగిందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం పేర్కొంది. 2018 కంటే ఈసారి అభ్యర్థుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. ఎన్నికల సంఘం పేపర్ల ముద్రణను సకాలంలో పూర్తి చేసింది. సోమవారం నాటికి బ్యాలెట్ పత్రాల పంపిణీ పూర్తి కానుంది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాక్ టెస్ట్ నిర్వహించింది. ఈ మాక్ టెస్ట్ లో 859 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. 

పాకిస్తాన్ చాలా కాలంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్‌ను  బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు. నవాజ్ మరోమారు ప్రధాని కాబోతున్నారని ఆయన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) చెబుతోంది. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)