Breaking News

పాకిస్తాన్‌ మళ్లీ రక్తసిక్తం

Published on Wed, 11/12/2025 - 05:29

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మరోసారి రక్తమోడింది. రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది బలయ్యారు. మరో 36 మంది క్షతగాత్రులుగా మారారు. ఇస్లామాబాద్‌ జిల్లా జ్యుడీషియల్‌ కోర్టు కాంప్లెక్స్‌ బయటే ఈ దాడి జరగడం గమనార్హం. దుస్తుల లోపల పేలుడు పదార్థాలు ధరించి వచి్చన దుండగుడు తొలుత కోర్టు ప్రాంగణంలోకి  ప్రవేశించేందుకు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో గేటు వద్ద పోలీసు వాహనం పక్కన నిల్చొని తనను తాను పేల్చేసుకున్నాడని పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్‌ నఖ్వీ వెల్లడించారు.

ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భద్రతా సిబ్బంది, ఒక లాయర్‌ సహా 12 మంది మృతి చెందినట్లు తెలిపారు. పేలుడు శబ్దం ఆరు కిలోమీటర్ల దాకా వినిపించడం గమనార్హం. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. జనం భయంతో పరుగులు తీశారు. ఈ దాడికి కారకులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి ఆత్మాహుతి దాడులు చేయడంలో తెహ్రీక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) ఆరితేరిందని పాక్‌ అధికారులు చెప్పారు.  

తాలిబన్లు మతిలేని యుద్ధం ఆపాలి: ఖవాజా అసిఫ్‌  
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగినట్లు పాకిస్తాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ, రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్‌ ధ్రువీకరించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టు సిబ్బందే ఉన్నారు. పేలుడు తీవ్రతకు సూసైడ్‌ బాంబర్‌ తల తెగి దూరంగా పడిపోయింది.

ఆత్మాహుతి దాడికి అఫ్గాన్‌లోని తాలిబన్‌ పాలకులు కారణం కావొచ్చని ఖవాజా అసిఫ్‌ అనుమానం వ్యక్తంచేశారు. తమపై ఈ మతిలేని యుద్ధం ఆపాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తాలిబన్లను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంపై పాక్‌ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజధానిలో దాడి జరగడం కలకలం సృష్టించింది.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)