Breaking News

అఫ్గాన్‌ సరిహద్దుల్లో పాక్‌ ఆపరేషన్‌.. 30మంది ఉగ్రవాదులు హతం

Published on Wed, 02/19/2025 - 07:40

పెషావర్: పాకిస్తాన్‌ సైన్యం పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో  ఈ సైనిక చర్య జరిగింది. నిఘావర్గాలు అందించిన సమాచారం మేరకు భద్రతా దళాలు ఈ ఆపరేషన్‌ చేపట్టి, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. దీనికి సంబంధించిన వివరాలను పాక్‌ సైన్యం మీడియాకు తెలిపింది.

ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్‌) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిన నేపధ్యంలో దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ఈ సైనిక చర్య విజయవంతమైన నేపధ్యంలో పాకిస్తాన్ సాయుధ దళాలను ప్రధాని షాబాజ్ షరీఫ్‌ ప్రశంసించారు.

దీనికి ముందు పాకిస్తాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వారు జరిపిన కాల్పుల్లో నలుగురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. 2025 జనవరి  నుంచి పాకిస్తాన్‌లో ఉగ్ర దాడులు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2024 డిసెంబర్‌ కంటే 42 శాతం ఎక్కువ. జనవరిలో ఉగ్రవాద నిరోధక చర్యలలో భాగంగా భద్రతా దళాలు 185 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఒక నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి: రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)