Breaking News

Operation Sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్‌ సైనికాధికారులు 

Published on Thu, 05/08/2025 - 02:08

ఇస్లామాబాద్‌:  పహల్గాం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని, ఉగ్రవాదులను పెంచిపోషించడం లేదని పాకిస్తాన్‌ ప్రభుత్వం నమ్మబలుకుతోంది. తమ దేశంలో ఉగ్రవాదుల క్యాంపులే లేవని కబుర్లు చెబుతోంది. అబద్ధాలతో ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టాలని చూస్తోంది. కానీ, పాక్‌ అసలు రంగు ప్రత్యక్షంగా బయటపడింది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం దాడిలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలు బుధవారం జరిగాయి. 

పాకిస్తాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిక కాశ్మీర్‌లో ముష్కరుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్‌ సైనికాధికారులు, జవాన్లు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు సైతం పాల్గొనడం గమనార్హం. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. లాహోర్‌ సమీపంలోని మురిడ్కేలో ముగ్గురు ఉగ్రవాదులు అబ్దుల్‌ మాలిక్, ఖలీద్, ముదాస్సిర్‌ల అంత్యక్రియల్లో లష్కరే తోయిబా సభ్యుడు హఫీజ్‌ అబ్దుల్‌ రవూఫ్‌ ప్రార్థనలు చేశాడు. 

ఈ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సైనికాధికారులు, పోలీసులు హాజరయ్యారు. పాకిస్తాన్‌ జాతీయ జెండాతో చుట్టిన ఉగ్రవాదుల శవపేటికలను సైనికాధికారులు, జవాన్లు స్వయంగా మోశారు. ప్రార్థనల అనంతరం ఖననం కోసం మృతదేహాలను ఉగ్రవాదుల స్వస్థలాలకు పంపించారు. పీఓకేలోని ముజఫరాబాద్‌లో జరిగిన అంత్యక్రియల్లోనూ పాక్‌ అధికారులు హాజరైనట్లు తెలిసింది.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)