Breaking News

పాక్, అఫ్గాన్‌ కాల్పుల విరమణ 

Published on Mon, 10/20/2025 - 05:46

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ మధ్య శాంతి దిశగా ముందడుగు పడింది. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇరుపక్షాలు ఆదివారం అంగీకారానికి వచ్చాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలం శాంతియుత పరిస్థితులు, స్థిరత్వం నెలకొనేలా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా దాడులు, కాల్పులు, ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల్లో పలువురు సైనికులు, సామాన్య ప్రజలు, ఉగ్రవాదులు మరణించారు. 

కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్, అఫ్గాన్‌ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్‌ మధ్య ఖతార్‌ రాజధాని దోహాలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల కోసం ఖతార్, తుర్కియే దేశాలు చొరవ తీసుకున్నాయి. కాల్పులు వెంటనే ఆపేయాలని పాక్, అఫ్గాన్‌ అంగీకారానికి వచి్చనట్లు ఖతార్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే రాబోయే రోజుల్లో తరచుగా సమావేశం కావాలని, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, భద్రత, స్థిరత్వానికి కట్టుబడి ఉండాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)