Breaking News

Pakistan: ‘ఆ 30-45 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు’

Published on Thu, 07/03/2025 - 21:16

ఆపరేషన్‌ సింధూర్‌లో భాగంగా తమ దేశంపైకి దూసుకొచ్చిన బ్రహ్మోస్‌ క్షిపణితో హడలిపోయామని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ సలహాదారు రానా సనుల్లాహ్‌ స్పష్టం చేశారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన బ్రహ్మోస్‌ క్షిపణితో భారత్‌ ఏమైనా అణు యుద్ధాన్ని ఆరంభించిందా అనే ఆలోచనలో పడ్డామన్నారు. రావల్పిడింలోని తమ ప్రధాన ఎయిర్‌ బేస్‌ నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై బ్రహ్మోస్‌ క్షిపణిని భారత్‌ ప్రయోగించిన క్రమంలో కాసేపు తాము అలా చూస్తూ ఉండిపోయామన్నారు. 

ప్రధానంగా 30 నుంచి 45 సెకన్ల పాటు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తమ సైన్యంలో ఏర్పడిందన్నారు.  తొలుత అణు యుద్ధంగా భావించామని, తర్వాత తేరుకుని మిసైల్‌తో దాడి చేశారనే విషయాన్ని గ్రహించామన్నారు.

‘ భారత్‌ న్యూక్లియర్‌ వార్‌హెడ్‌ను భారత్‌ ఉపయోగించకపోవడంతో వారు మంచి చేశారని నేను చెప్పడం లేదు. మా దేశ ప్రజలు మాత్రం దీనిపై కచ్చితంగా తప్పుగా అర్ధం చేసుకుని ఉంటారు.  అది అణు యుద్ధమేనని మా ప్రజలు అనుకుని ఉంటారు. ఒకవేళ అదే జరిగితే తొలి ప్రపంచ న్యూక్లియర్‌ వార్‌ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉండేది’ అని  రానా సనుల్లాహ్‌ స్పష్టం చేశారు.

పెహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టింది. దీనిలో భాగంగా భారత్‌ బ్రహ్మోస్‌ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఆ బ్రహ్మోస్‌ క్షిపణి మెరుపుదాడిలో పాకిస్తాన్‌లో పలు ప్రాంతాలు అతలాకులమయ్యాయి. నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ పరిధిలోని పాకిస్తాన్‌ శాటిలైట్‌ వ్యవస్థ నాశనమైంది.  

పాకిస్తాన్‌ నూర్ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ ప్రాంతంలో భారత్‌ దాడి చేయడం ఇది తొలిసారి కాదు. 1971లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో సైతం నూర్‌ ఖాన్‌ ప్రాంతాన్ని భారత్‌ టార్గెట్‌ చేసి పాక్‌ను కోలునీయకుండా చేసింది. 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)