Breaking News

మేల్కొనేలోపే  మెరుపుదాడి చేసింది

Published on Fri, 05/30/2025 - 04:40

లాచిన్‌(అజర్‌బైజాన్‌): భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా చేసిన వైమానిక దాడులకు దీటుగా స్పందించేలోపే భారత్‌ మళ్లీ క్షిపణులతో విరుచుకుపడుతుందని తాము ఊహించలేదని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఒప్పుకున్నారు. అజర్‌బైజాన్‌ దేశంలో పర్యటిస్తున్న షెహబాజ్‌ గురువారం లాచిన్‌ సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఆపరేషన్‌ సిందూర్‌ సంగతులను అందరితో పంచుకున్నారు. 

‘‘ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్‌ చేసిన దాడులకు స్పందనగా ప్రతీకార దాడులతో తెగబడాలని నిర్ణయించాం. మే 9వ తేదీ అర్ధరాత్రి దాటాక ఇందుకు ప్రణాళిక సిద్ధంచేశాం. తెల్లవారు జామున 4.30 గంటలకు ఫజర్‌ ప్రార్థనల తర్వాత దాడి చేయాలని భావించాం. కానీ ఆలోపే భారత్‌ బ్రహ్మోస్‌ క్షిపణుల వర్షం కురిపించింది. వేర్వేరు ప్రావిన్సుల్లోని వైమానిక స్థావరాలపై క్షిపణిదాడులు జరిగాయి. 

రావల్పిండిలోని ఎయిర్‌పోర్ట్‌ సైతం దాడులకు ధ్వంసమైంది’’ అని షెహబాజ్‌ చెప్పారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ ఎదుటే ఈ దాడుల అంశాన్ని షెహబాజ్‌ ప్రస్తావించడం గమనార్హం. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌ వైమానిక స్థావరం మీదా భారత్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ స్థావరం పాకిస్తాన్‌ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఇక్కడ అత్యంత అధునాతన లాక్‌హీడ్‌ సీ–130 హెర్క్యులస్, ల్యూషిన్‌ ఐఐ–78 ఇంధనం నింపే విమానాలు ఉన్నాయి.  
 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)