బంకర్‌లో దాక్కోమన్నారు 

Published on Sun, 12/28/2025 - 11:26

లాహోర్‌: ఈ ఏడాది మేలో భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన సమయంలో బంకర్‌లో దాక్కోవాలంటూ అధికారులు తనకు సలహా ఇచ్చారని పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దార్‌ వెల్లడించారు. 2007లో హత్యకు గురైన తన భార్య, మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో వర్ధంతి సందర్భంగా సింధ్‌ ప్రావిన్స్‌లోని లార్కానాలో ఆదివారం ఏర్పాటైన కార్యక్రమంలో జర్దారీ ఈ విషయం తెలిపారు. ‘సర్, యుద్ధం మొదలైంది. 

సురక్షితంగా ఉండటం కోసం బంకర్‌కు వెళ్దాం రండి అంటూ నా సెక్రటరీ వచ్చి నాతో అన్నారు. అందుకు నేను అంగీకరించలేను. మృత్యువు వస్తే ఇక్కడికే రానీయండి. నేతలు ప్రాణాలొదలాల్సింది యుద్ధ క్షేత్రంలోనే..బంకర్‌లలో కాదని చెప్పా. నేతలు బంకర్‌లలో కూర్చుని చనిపోవడం సరికాదని అతడికి తెలిపాను. వాస్తవానికి యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తమకు తెలుసు’అని అన్నారు.  భారత్‌ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్‌ కంటే 10 ఎక్కువే అయినా, ఆ దేశానికి యుద్ధం చేసే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు.  

అదంతా అబద్ధం: ఆర్మీ రిటైర్డు అధికారి 
ఆసిఫ్‌ జర్దారీ చేసిన ప్రకటనపై భారత లెఫ్టినెంట్‌ జనరల్‌(రిటైర్డు) కేజేఎస్‌ ధిల్లాన్‌ ఘాటుగా స్పందించారు. యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తెలిస్తే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత క్షిపణులను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆపరేషన్‌ సిం«ధూర్‌ వేళ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ సహా రాజకీయ నేతలు, మిలటరీ కమాండర్లు బంకర్‌లోనే దాక్కున్నారన ధిల్లాన్‌ చెప్పారు.  

నూర్‌ ఖాన్‌ స్థావరంపై దాడి వాస్తవమే
భారత్‌తో మేలో తలెత్తిన సంక్షోభం సమయంలో నూర్‌ ఖాన్‌ ఎయిర్‌ బేస్‌ దాడికి గురైందని పాకిస్తాన్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ అంగీకరించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ అంగీకరించడం ఇదే మొదటిసారి. ‘ఆ∙రోజు ఉదయం 8.15 గంటల వేళ అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్‌ చేసి..కాల్పుల విరమణకు భారత్‌ సిద్ధంగా ఉంది. మీరూ సిద్ధమా? అని నన్నడిగారు. పాక్‌ ఎల్లప్పు డూ శాంతినే కోరుకుంటుందని బదులిచ్చా’ అని తెలిపారు. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)