హౌసింగ్‌ కుంభకోణం: పాక్‌ మాజీ ఐఎస్‌ఐ చీఫ్‌ అరెస్ట్‌

Published on Mon, 08/12/2024 - 20:35

ఇస్లామాబాద్‌: మాజీ ఇంటర్‌ సర్విసెస్‌ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) చీఫ్ ఫైజ్ హమీద్‌ను పాకిస్తాన్‌ ఆర్మీ అరెస్ట్ చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు సోమవారం పాక్‌ ఆర్మీ వెల్లడించింది. టాప్ సిటీ కేసు (హైసింగ్‌ స్కీమ్‌)లో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరూపితం అయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనపై విచారణను చెపట్టినట్లు పాక్‌ ఆర్మీ  పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగం  ఓ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ ఆర్మీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఫైజ్ హమీద్‌పై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు వెల్లడిం​చింది. ఆయనపై ఇచ్చిన  అధికార దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సైన్యం ఏప్రిల్‌లో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 

నవంబర్ 8,2023న టాప్ సిటీ హౌసింగ్ డెవలప్‌మెంట్‌ ఓనర్‌ మోయీజ్ అహ్మద్ ఖాన్ పాకిస్థాన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. హమీద్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అహ్మద్‌ ఖాన్ 2017లో ఆరోపణలు చేశారు. ఐఎస్‌ఐ అధికారులు హమీద్ ఇంటిపై దాడులు చేయగా..  బంగారం, వజ్రాలు, నగదుతో సహా విలువైన వస్తువులను బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్ఐ (కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్) చిఫ్‌గా పనిచేశారు. తర్వాత  ఆయన జూన్ 2019 నుంచి 6 అక్టోబర్ 2021 వరకు ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.  ఫైజ్‌ హమీద్‌  ఐఎస్‌ఐ 24వ డైరెక్టర్ జనరల్‌గా సేవలు అందించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)