Breaking News

ఇక ఇజ్రాయెల్‌ నుంచి భారతీయుల తరలింపు

Published on Sun, 06/22/2025 - 12:49

న్యూఢిల్లీ: ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడంతో మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఇరాన్‌ నుంచి భారత పౌరులను వెనక్కి రప్పించిన భారత్‌ ఇప్పుడు ఇజ్రాయెల్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది.

ఇజ్రాయెల్ నుంచి వెళ్లిపోవాలనుకునే భారతీయ పౌరులను భారత్‌ అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)తెలిపింది. ఇజ్రాయెల్ నుండి భారతదేశానికి ముందుగా భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్‌కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యాలు కల్పించనున్నామని ఎంఈఏ తెలిపింది. విదేశాలలో ఉన్న భారత పౌరుల భద్రతకు భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొంది.

భారత్‌ చేరుకోవాలనుకునేవారు టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించాలని ఎంఈఏ తెలిపింది. ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. ఇరాన్ నుండి భారతీయులను తరలించడానికి భారత్‌ ఇప్పటికే ఆపరేషన్ సింధును ప్రారంభించింది. దీనిలో భాగంగా 800 మందికి పైగా భారతీయులను మూడు చార్టర్ విమానాలలో భారత్‌ తరలివచ్చారు. 

ఇది కూడా చదవండి: అణు కేంద్రాలపై దాడులతో రేడియేషన్‌ లీక్‌?

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)