Breaking News

హమాస్‌ను మట్టికరిపించిన 13 మంది మహిళలు

Published on Sat, 10/28/2023 - 07:05

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మొదట ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై క్షిపణులతో బాంబు దాడి చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం హమాస్ యోధులను భూ ఉపరితలంపై ఓడించింది. కాగా ఇజ్రాయెల్‌కు చెందిన ప్రత్యేక దళం కిబ్బట్జ్ నగరాన్ని హమాస్ యోధుల చెర నుండి విడిపించింది. ఈ దళంలో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉండటం విశేషం. వారికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

అక్టోబరు 7న హమాస్ యోధులు ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పుడు వారు ఇజ్రాయెల్‌లోని కిబ్బట్జ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఇజ్రాయెల్ సైన్యం ఈ నగరాన్ని విడిపించే బాధ్యతను లెఫ్టినెంట్ బెన్ యెహుదా బృందానికి అప్పగించింది. ఈ టీమ్‌లో 13 మంది మహిళలు ఉన్నారు. ఈ 13 మంది కిబ్బట్జ్ నగరంలోకి ప్రవేశించి, హమాస్ యోధులను ఓడించారు.

హమాస్‌ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ తన మొత్తం సైన్యాన్ని భూ ఉపరితలంపైకి దింపింది. ఈ సైన్యంలో దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు పావువంతు మంది మహిళలే. గ్రౌండ్ జీరో వద్ద కూడా మహిళా సైనికులు హమాస్ యోధులతో భీకరంగా పోరాడుతున్నారు. అయితే లెఫ్టినెంట్ బెన్ యెహుదా బృందం కొన్ని గంటల్లో వంద మంది హమాస్ యోధులను హతమార్చింది. ఈ నేపధ్యంలో ఈ ఫోర్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో పాటు, ఈ మహిళా యోధులను ఇజ్రాయెల్ సింహాలుగా పిలుస్తున్నారు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్- హమాస్ మధ్య 19 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 7,044 మంది మరణించారు. వీరిలో 1400 మంది ఇజ్రాయెల్‌కు చెందిన వారు కాగా, 6546 మంది గాజా స్ట్రిప్‌కు చెందిన వారు. గాజా స్ట్రిప్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మొత్తం 756 మంది మృతి చెందారు. 
ఇది కూడా చదవండి: చైనా శాస్త్రవేత్తల కంటికి ఎనిమిది వైరస్‌లు.. మహమ్మారులుగా మారనున్నాయా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)