Breaking News

‘అంతర్జాతీయ చట్టానికి తూట్లు’.. అమెరికా దాడులను ధృవీకరిస్తూ ఇరాన్‌

Published on Sun, 06/22/2025 - 09:11

టెహ్రాన్: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్‌ ప్రపంచం దృష్టి సారించింది. తాజాగా ఇరాన్‌ అణుశక్తి సంస్థ (ఆటమిక్‌ ఎనర్జీ ఆర్గనైజేషన్‌) ఆదివారం తెల్లవారుజామున తమ దేశంలోని మూడు అణుశక్తి కేంద్రాలపై జరిగిన దాడులను ధృవీకరించింది. ఈ విధంగా అణుకేంద్రాలపై దాడులు జరిపి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించింది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల  కారణంగా ఎంత నష్టం జరిగిందో స్పష్టం చేయకుండా, దాడుల వివరాలను ప్రకటించారని ఇరాన్‌ పేర్కొంది. అణు కేంద్రాలపై సాగించిన దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం కిందకువస్తుందని టెహ్రాన్ ఏజెన్సీ పేర్కొంది. అమెరికా సైన్యం  తాజాగా ఇరాన్‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్ అణుశక్తి సంస్థపై శత్రువుల కుట్రలు సాగుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు, నిపుణుల ప్రయత్నాలతో ఏర్పడిన ఈ జాతీయ పరిశ్రమ అభివృద్ధిని ఆపబోమని ఇరాన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్‌లో సంభాషిస్తూ జియోనిస్ట్ పాలనలోని దురాక్రమణకు తమ ప్రతిస్పందన మరింత వినాశకరంగా ఉంటుందని హెచ్చరించారని అధికారిక ఇర్నా వార్తా సంస్థ పేర్కొంది.  ఈ దాడుల కారణంగా టెహ్రాన్‌కు దక్షిణంగా ఉన్న కోమ్ నివాసితులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇక్కడికి సమీపంలోని పర్వతాలలోగల అణు కేంద్రంపై అమెరికా దాడి చేసింది.



ఇది కూడా చదవండి: ట్రంప్‌ చరిత్రను తిరగరాశారు: నెతన్యాహు

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు