Breaking News

అప్పుడు మేం అలస్కాను యూఎస్‌కు అమ్మేశాం: పుతిన్‌

Published on Thu, 01/22/2026 - 08:28

గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊహించని మద్దతు లభించింది. ఇప్పటివరకూ అమెరికా- గ్రీన్‌లాండ్‌ అంశంపై రష్యా వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందని అంతా భావించినా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం.. యూఎస్‌కే దాదాపు మద్దతు తెలిపాడు. 

జాతీయ భద్రతా మండలిలో పుతిన్‌ మాట్లాడుతూ.. ‘ గ్రీన్‌లాండ్‌ అంశం మాకు సంబంధం లేదు. అది యూఎస్‌-నాటోలు చూసుకుంటాయి. గ్రీన్‌లాండ్‌ మా జోక్యం ఉండదు. అది అసలు రష్యాకు సంబంధం లేని అంశం. ఆ విషయాన్ని నాటో ఆర్గనైజేషన్‌-అమెరికాలు చూసుకుంటాయి. గ్రీన్‌లాండ్‌పై మధ్యలో మేము దూరాల్సిన అవసరం లేదు. 

గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్‌ ఎప్పుడూ కాలనీగా చూస్తుంది. గ్రీన్‌లాండ్‌పై క్రూరత్వం ప్రదర్శించకపోయినా.. దానిపై డెన్మార్క్‌ కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది.  ఏది ఏమైనా.. ఏం జరిగినా గ్రీన్‌లాండ్‌ ఎపిసోడ్‌ అనేది మాకు అనవసరం. వాళ్ల వాళ్లు చూసుకుంటారు. మాకైతే సంబంధమే లేదు.  1917లో వర్జిన్‌ దీవుల్ని అమెరికాకు డెన్మార్క్‌ అమ్మేసింది. మేం కూడా అలస్కా(ప్రస్తుతం యూఎస్‌లో  ఉన్న 49వ రాష్ట్రం) ను యూఎస్‌కు అమ్మేసాం. 1867లో సుమారు 7.2 మిలియన్‌ డాలర్లకు అలస్కాను అమ్మేశాం’ అని పుతిన్‌ గతాన్ని గుర్తు చేసుకున్నారు.

    
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)