Breaking News

‘నాకు శాంతి నోబెల్‌ ఇవ్వకుంటే అమెరికాను అవమానించినట్టే’

Published on Thu, 10/02/2025 - 06:38

న్యూయార్క్‌: నోబెల్‌ శాంతి బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా ఏకంగా బెదిరింపులకే దిగారు. తనకు శాంతి నోబెల్‌ ఇవ్వకుంటే అమెరికాను తీవ్రంగా అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఏడు సాయుధ ఘర్షణలను ఆపిన తనకు నోబెల్‌ బహుమతి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. 

గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను సోమవారం ప్రతిపాదించిన ప్రణాళికపై మంగళవారం క్వాంటికోలో మిలిటరీ అధికారులతో ట్రంప్‌ మాట్లాడారు. ‘మనం సాధించాం. సమస్య పరిష్కారమైనట్టే అని భావిస్తున్నాను.. చూడాలి మరి. దీనిని హమాస్‌ అంగీకరించాల్సిందే (శాంతి ప్రణాళికను). లేదంటే వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని అరబ్‌దేశాలు, ముస్లిం దేశాలు ప్రణాళికను అంగీకరించాయి. ఇజ్రాయెల్‌ కూడా అంగీకరించింది. 

ఇది అద్భుతమైన విషయం. పరిస్థితి కొలిక్కి వచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటి పని ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అయినా, నోబెల్‌ బహుమతి ఇస్తారా?.. ఇవ్వనే ఇవ్వరు. ఇలాంటి పని ఏదీ చేయని ఎవరో ఒకరికి ఇస్తారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనలపై పుస్తకం రాసి, యుద్ధాన్ని ఎలా ఆపాలి అని అందులో వివరించే ఎవరో ఒకరికి నోబెల్‌ ఇస్తారు. ఏం జరుగుతుందో చూడాలి.

 ఎవరో ఒక పుస్తక రచయితకు నోబెల్‌ శాంతి బహుమతి ఇస్తే మాత్రం అది అమెరికాకు తీవ్రమైన అవమానమే. ఇది నేను కచ్చితంగా చెప్పగలను. నాకు అది (నోబెల్‌) అవసరం లేదు. మన దేశం దానిని (నోబెల్‌) సాధించాలని కోరుకుంటున్నా. గాజా ఘర్షణకు ముగింపు పలికే ప్రణాళిక అమలవుతుందనే భావిస్తున్నా. ఇది నేను ఆశామాషీగా చెప్పటం లేదు. నాకు అన్నింటికంటే ఇలాంటి డీల్స్‌ గురించి బాగా తెలుసు. నా జీవితం మొత్తం ఇలాంటివాటితోనే గడిచింది. అందులో ఈ 8 (గాజా ఘర్షణతో కలిసి ట్రంప్‌ ఆపానని చెబుతున్న యుద్ధాలు) గొప్ప విషయాలు’అని ట్రంప్‌ పేర్కొన్నారు.  

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)