Breaking News

‘తలపై గురిపెట్టేవారితో మాట్లాడేదే లేదు’: ఎంపీ శశి థరూర్‌

Published on Thu, 06/05/2025 - 13:01

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ తీరుపై ఎంపీ శశిథరూర్‌(MP Shashi Tharoor) మండిపడ్డారు. ఉగ్రవాద బెదిరింపులు కొనసాగుతున్నంత కాలం పాకిస్తాన్‌తో భారత్‌ మాట్లాడే ప్రస్తకే లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న అఖిలపక్షానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. తమ ప్రతినిధి బృందం వివిధ దేశాల్లో పర్యటిస్తూ, పాక్‌ తీరును ఎండగడుతున్నదన్నారు.

వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ఎంపీ శశిథరూర్‌ మాట్లాడుతూ ‘మా తలపై తుపాకీ గురిపెట్టేవారితో చర్చలు జరిపేదేలేదని’ ఆయన స్పష్టం చేశారు.  సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని అమెరికాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ఎదుట స్పష్టం చేసినట్లు థరూర్‌ పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ చర్చలను ప్రోత్సహించడంలో అమెరికా ప్రమేయంపై ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్‌ విషయంలో భారత వైఖరిని అమెరికా అర్థం చేసుకున్నదన్నారు. భారత్‌ సూత్రప్రాయంగా సంభాషణకు సిద్ధంగా ఉందని,  అయితే అది బలవంతంగా ఎప్పటికీ జరగదని ఆయన అన్నారు.

వాణిజ్యాన్ని సాకుగా చూపిస్తూ, భారత్‌-పాక్‌ యుద్ధాన్ని నియంత్రించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) చేసిన వాదనను కాంగ్రెస్ ఎంపీ తిరస్కరించారు. తనకు అలాంటి అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లకు వచ్చిన పోన్‌ కాల్స్‌ ‌ చూపిస్తూ, ఆ సంభాషణల్లో ఎప్పుడూ వాణిజ్యాన్ని ప్రస్తావించనే లేదని ఆయన అని పేర్కొన్నారు. భారతదేశానికి ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం లేదని, వారు ఆగిపోతే, మేము ఆగిపోతామని, తాము ఆత్మరక్షణ దిశగా వ్యవహరించామని థరూర్‌ పేర్కొన్నారు.

భారత్‌కు చెందిన కొందరు ఎంపీలు, అమెరికాలోని మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో కూడిన భారత ప్రతినిధి బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన దరిమిలా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ గురించి భాగస్వామ్య దేశాలకు వివరించడమే లక్ష్యంగా అఖిలపక్ష సభ్యుల పర్యటన సాగుతోంది.  ఈ బృందంలో థరూర్‌తో పాటు, బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, భువనేశ్వర్ కలిత, శశాంక్ మణి త్రిపాఠి ఉన్నారు. అలాగే శివసేన నుంచి మిలింద్ దేవరా, మల్లికార్జున్ దేవరా, శాంభవి చౌదరి (లోక్ జనశక్తి పార్టీ), సర్ఫరాజ్ అహ్మద్ (జార్ఖండ్ ముక్తి మోర్చా),జీఎం హరీష్ బాలయోగి (తెలుగు దేశం పార్టీ) ఉన్నారు.

ఇది  కూడా చదవండి: బెంగళూరు తొక్కిసలాట: మృతులంతా 40 ఏళ్లలోపు వారే..

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)