Breaking News

బ్రిటిష్‌ కశ్మీరీ ప్రొఫెసర్‌ ఓసీఐ రద్దు.. కారణమిదే..

Published on Tue, 05/20/2025 - 12:16

లండన్: భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నవారిపై ప్రభుత్వం దృష్టిసారించింది. తాజాగా లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన బ్రిటిష్ అకాడమిక్ నితాషా కౌల్‌(Nitasha Kaul)కు చెందిన ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) స్టేటస్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా సాయంతో వెల్లడించారు.

తాను భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నానని, ప్రత్యేకించి తన రచనలు, ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు.. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని భారత ప్రభుత్వం తనపై ఆరోపణలు గుప్పించిందని నితాషా కౌల్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు. గోరఖ్‌పూర్‌లో జన్మించిన కౌల్‌ కశ్మీరీ పండిట్, బ్రిటిష్ పౌరురాలు. ఆమె వెస్ట్‌మిన్‌స్టర్ విశ్వవిద్యాలయం(University of Westminster)లో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ (సీఎస్‌డీ) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, యాక్టివిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం తన ఓసీఐ స్టేటస్‌ను రద్దు చేయడాన్ని క్రూరమైన, ప్రతీకార చర్యగా ఆమె అభివర్ణించారు.

2024 ఫిబ్రవరిలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ‘రాజ్యాంగం, భారత ఐక్యత" అనే అంశంపై ఒక సమావేశంలో ప్రసంగించేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న నితాషాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని, లండన్‌కు తిరిగి పంపించారు. ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)ను విమర్శించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు నాడు తెలిపారు. భారత ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో నితాషా కౌల్.. భారతదేశ సార్వభౌమత్వంపై దురుద్దేశపూరితంగా, వాస్తవాలు లేదా చరిత్రను పట్టించుకోకుండా రచనలు, ప్రసంగాలు, జర్నలిస్టిక్ కార్యకలాపాటు సాగించినట్లు పేర్కొంది. లండన్‌లోని భారత హైకమిషన్ నిర్దేశించిన ఓసీఐ నిబంధనల ప్రకారం, భారత ప్రభుత్వం ఏ వ్యక్తి కి చెందిన ఓసీఐ రిజిస్ట్రేషన్‌ను అయినా కొన్ని నిర్దిష్ట కారణాలతో రద్దు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే..

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు