అరబ్ దేశాలపై నిక్కి హేలి ఫైర్‌​‍

Published on Mon, 10/16/2023 - 11:28

న్యూయార్క్‌ అరబ్ దేశాలపై రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి నిక్కి హేలి ఫైరయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తున్న అరబ్ దేశాలు.. పాలస్తీనియన్లను ఎందుకు ఆహ్వానించట్లేదని మండిపడ్డారు. ఇరాన్ న్యూక్లియర్ డీల్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ బామా, జో బైడెన్‌ను విమర్శించారు. హమాస్, హెజ్బొల్లాను పెంచి పోషిస్తున్నారని ఇరాన్‌ను దూషించారు. 

'పాలస్తీనా అమాయక ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఖతార్, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టు దేశాల పాత్ర ఎంటి?  ఈజిప్టుకు ఏడాదికి బిలియన్లు కొద్ది అమెరికా డబ్బుల్ని ఇస్తోంది. పాలస్తీనియన్ల కోసం గేట్లు  తెరవలేరా..?' అని నిక్కి హేలి అన్నారు. 

'పాలస్తీనియన్లు వారికి వద్దు. వారి పక్కనే హమాస్ ఉంచుకోవాలనుకోరు. మరి ఇజ్రాయెల్ ఎందుకు వారిని ఉంచుకుంటుంది? పాలస్తీనియన్లను అరబ్ దేశాలు రక్షించాలనుకోరు. వారిని తమ దేశాల్లో ఉంచుకోవాలనుకోరు. కానీ అమెరికా, ఇజ్రాయెల్‌ను నిందిస్తుంటారు. పశ్చిమాసియా సమస్యలను పరిష్కరించగల సత్తా వారికి ఉంది. కానీ చేయరు. హమాస్‌తో నిత్యం కలిసి పనిచేస్తుంటారు. వారికి నిధులను సమకూరుస్తారు. ఇజ్రాయెల్ దాడులపైనే మాట్లాడుతున్నారు. హమాస్ ఏం చేసిందో మాట్లాడరు. హమాస్ అరాచకాలపై పెదవి విప్పరు.' అని నిక్కి హేలి మండిపడ్డారు. 

ఇదీ చదవండి ఇజ్రాయెల్‌ నుంచి స్వదేశానికి మరో 471 మంది..

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)