Breaking News

ఏఐ కంపు కోణాన్ని బయటపెట్టిన మహిళా ఎంపీ

Published on Tue, 06/03/2025 - 16:58

అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ.. షార్ట్ కట్‌లో ఏఐ. ఇప్పుడు దాదాపు ప్రతీ రంగంలో దీని వినియోగం ఉంటోందని, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, ఆ సాంకేతికత ఆధారంగా జరుగుతున్న కంపు వ్యవహారాలను మాత్రం చర్చించుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడో ఓ మహిళా ప్రజా ప్రతినిధి ధైర్యం చేసి ముందడుగు వేశారు.

లారా మెక్‌క్లూర్‌.. న్యూజిలాండ్‌ ఏసీటీ పార్టీ ఎంపీ. ఈవిడ చేసిన‌ ఓ పని ఇప్పుడు మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. చట్ట సభలో.. అదీ సభ్యులందరి ముందు గూగుల్‌లో నుంచి తన నగ్న ఫొటోను వెతికి.. ప్రింట్‌ తీసి మరీ అందరి ముందు ప్రదర్శించారామె. ‘‘ఇది నా నగ్న చిత్రమే. కానీ, నిజమైంది కాదు. వీటిని గూగుల్‌ నుంచే తీశాను. అయితే వీటిని సృష్టించి..గూగుల్‌లో అప్‌లోడ్‌ చేసింది కూడా నేనే. ఇందుకు నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. ఐదు నిమిషాలలోపే పట్టింది’’ అని అన్నారామె.

తద్వారా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌ ఎంత ప్రమాదకరమైందో చెప్పే ప్రయత్నం చేశారామె. చట్ట సభను అగౌరవపరిచే ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదని, దేశ యువతకు జరిగే నష్టం గురించి సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. 

‘‘డీప్‌ఫేక్‌.. చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఫొటోలు, వీడియోలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను చేసిన పని మీకు జుగుప్సగా అనిపించొచ్చు. కానీ, ఈ వ్యవహారం ఎంత సులువో.. అంతే ప్రమాదకరమైంది కూడా. అది మీరంతా ఆలోచించాలనే ఇలా చేశా. ఇక్కడ సమస్య టెక్నాలజీతో కాదు. దానిని తప్పుడు దోవలో ఉపయోగిస్తున్న విధానమే. కాబట్టి.. వీటి కట్టడికి ప్రత్యేక చట్టాలు కచ్చితంగా అవసరం’’ అని ప్రసంగించారామె. మే 14వ తేదీన జరిగిన ఈ డిబేట్‌ తాలుకా వివరాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

ఏఐను వివిధ రంగాల్లో ఎంత సవ్యంగా ఉపయోగిస్తున్నారో.. సోషల్‌ మీడియాలో అంతే తప్పుడు దోవలోనూ ఉపయోగించడం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో!. వాళ్ల మీద అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సృష్టించి యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి పాపులర్‌ యాప్‌లలోనూ కొందరు ఆకతాయిలు వదులుతుండడం గమనార్హం. అయితే ఇలాంటివి తమ కంట పడ్డా కూడా గట్టిగా నిలదీసేందుకు ప్రముఖులు ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం.

Videos

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు