Breaking News

New Zealand: ఆమె మళ్లీ వచ్చింది.. దద్దరిల్లిన పార్లమెంట్‌!

Published on Fri, 11/15/2024 - 07:47

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీ హన-రాహితి ‘హక’ వినూత్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పేపర్లను చించేస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.

న్యూజిలాండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా హన-రాహితి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్‌లో ఆమె అడుగుపెట్టిన తర్వాత.. తమ కమ్యూనిటీ(మావోరి కమ్యూనిటీ)పై వివక్షను ప్రశ్నిస్తూ ఎంపీ హన-రాహితి పార్లమెంటులో చేసిన ప్రసంగం సంచలనం రేపింది. గిరిజన సంప్రదాయ పద్దతిలో హక చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక, తాజాగా మరోసారి హన-రాహితి ఇలా నిరసన తెలిపారు.

తాజాగా ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ హన ‘హక’ ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా పార్లమెంట్‌లో బిల్లు పేపర్లు చించేస్తూ అధికార సభ్యులను చూస్తూ కోపంతో ఊగిపోయారు. ఇక, వెంటనే ఆమెకు మద్దతుగా సహచర ఎంపీలు, గ్యాలరీలో ఉన్నవారు కూడా గళం కలపడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా.. ఆమె గత ఏడాది అక్టోబర్‌లో నానాయా మహుతా నుంచి పోటీ చేసి హన-రాహితి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె (మావోరి కమ్యూనిటీ) గిరిజనుల కోసం పోరాడుతున్నారు. ఆమె హంట్లీ అనే ఓ చిన్న పట్టణానికి చెందింది. ఇక జనవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ‘నేను మీ కోసం చనిపోతాను. కానీ నేను మీకోసం కూడా జీవిస్తాను. నేను రాజకీయ నాయకురాలిని కాదు. మావోరీ భాష యొక్క సంరక్షకురాలిని అని చెప్పుకొచ్చారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)