Breaking News

న్యూయార్క్‌ మహిళపై ఆరోపణలు 

Published on Sun, 12/07/2025 - 05:24

న్యూయార్క్‌: కెనడా సరిహద్దుల మీదుగా అమెరికాలోకి భారత్‌ నుంచి దొంగచాటుగా తరలించేందుకు ప్రయతి్నస్తున్నదంటూ న్యూయార్క్‌కు చెందిన మహిళపై అధికారులు కేసు నమోదు చేశారు. పిట్స్‌బర్గ్‌కు చెందిన స్టేసీ టేలర్‌(42)కు అంతర్జాతీయ దొంగరవాణా ముఠాతో సంబంధాలున్నట్లు అక్టోబర్‌లో అధికారులు ఆరోపణలు చేశారు. ఈ వారంలో అల్బనీలోని ఫెడరల్‌ గ్రాండ్‌ జ్యూరీ ఎదుట ఆమె హాజరు కావాల్సి ఉంది. 

శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కెనడాలోని క్విబెక్, అమెరికాలోని చురుబుస్కో సమీపంలో ఈ ఏడాది జనవరిలో అమెరికా బోర్డర్‌ పెట్రోల్‌ అధికారులు స్టేసీ టేలర్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆ వాహనంలో నలుగురు విదేశీయులు ఉన్నట్లు గుర్తించామని బోర్డర్‌ పెట్రోల్‌ విభాగం ఆరోపించింది. 

నలుగురిలో ముగ్గురు భారత జాతీయులుగా కాగా, ఒకరు కెనడా వాసి అని వీరిని కెనడా నుంచి అమెరికాలోకి దొంగచాటుగా తీసుకువచ్చారని పేర్కొంది. స్టేసీ టేలర్‌ సెల్‌ఫోన్‌ను క్షుణ్నంగా పరిశీలించగా అందులో..అంతకుముందు కూడా ఆమె ఇలా పలుమార్లు అక్రమ రవాణాకు పాల్పడినట్లు తెలిపే టెక్ట్స్‌ మెసేజీలున్నాయని వివరించింది. ఇతరులతో కలిపి ఆమె స్మగ్లింగ్‌ రాకెట్‌ నడుపుతున్నారని అధికారులు ఆరోపించారు. ఈ ఆరోపణలు రుజువైతే స్టేసీకి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.  

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)