Breaking News

ట్రంప్‌ మోసగాడే: తేల్చేసిన న్యూయార్క్‌ జడ్జి

Published on Wed, 09/27/2023 - 12:57

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుమారులు దాదాపు పదేళ్లపాటు తప్పుడు ఆర్థిక నివేదికలను సమర్పించారని న్యూయార్క్ న్యాయమూర్తి స్పష్టం చేశారు. ట్రంప్‌ మోసానికి పాల్పడ్డారంటూ ఆయన తేల్చిచెప్పారు. 

ట్రంప్‌ తన కంపెనీ ఆస్తుల విలువను అధికంగా అంచనా వేయడం ద్వారా పలు ఒప్పందాలు చేసుకోవడంతోపాటు, అక్రమంగా రుణాలు పొందారని న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోన్‌ తెలిపారు. తన ఆస్తుల విలువను డాక్యుమెంట్లలో భారీగా చూపించి, పలు బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను ట్రంప్‌ మోసం చేశారన్నారు.

జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం కేసు విచారణ నేపధ్యంలో ట్రంప్‌కు సంబంధించిన కొన్ని వ్యాపార సంస్థల లైసెన్స్‌లను రద్దు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా ట్రంప్, అతని ముగ్గురు పిల్లలు సంయుక్తంగా వారి కంపెనీల విలువను పెంచి, బ్యాంకులు, బీమా సంస్థలకు చూపారని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఆరోపించారు. ట్రంప్‌కు, ఆయన సంతానానికి 250 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని, న్యూయార్క్ లో ట్రంప్ వ్యాపారం చేయకుండా నిషేధించాలని  డిమాండ్ చేశారు.

ట్రంప్‌కు విధించాల్సిన శిక్షపై నిర్ణయం తీసుకునే ముందు న్యూయార్క్ జడ్జి ఆర్థర్ ఎంగ్రోన్‌ అక్టోబర్ 2న నాన్-జ్యూరీ ట్రయల్‌ని నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ చాలా కాలంగా వాదిస్తున్నారు. విచారణకు ముందే తనపై ఉన్న కేసును కొట్టివేయాలని అతని లాయర్లు న్యూయార్క్ న్యాయమూర్తిని గతంలో కోరారు. కాగా న్యూయార్క్‌ జడ్జి ఇచ్చిన తీర్పు.. 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌కు గట్టి  ఎదురుదెబ్బకానుంది.
ఇది కూడా చదవండి: చైనా ముంగిట మాద్యం ముప్పు? ఆమెరికాతో చెలిమికి డ్రాగన్‌ సై?

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)