Breaking News

30 ఏళ్లలో మొదటిది : అమెరికాలో మశూచితో చిన్నారి మృతి

Published on Wed, 11/04/2026 - 18:04

న్యూయార్క్  :  అమెరికాలోని రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో ఒక చిన్నారి మీజిల్స్ (తట్టు) బారిన పడి సోమవారం మరణించింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనల నేపథ్యంలో     తాజా ఘటన మరింత కలకలం రేపింది.  సిరాక్యూస్‌ ప్రాంతంలోని లూయిస్‌ కౌంటీలో ఘటన చోటుచేసుకుంది. గత 30 ఏళ్లలో ఈ వ్యాధి కారణంగా   నమోదైన తొలి మరణం ఇదే. 

ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని  న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్  తెలిపారు.  ఈ మరణం ప్రభుత్వ   ప్రజారోగ్య వ్యవస్థల్లోని సంక్షోభానికి అద్దం పడుతోందన్నారు. గత నెలలోనే గవర్నర్ హోచుల్, మీజిల్స్ వ్యాప్తిని రాష్ట్రవ్యాప్త విపత్తుగా ప్రకటించారు. 2000లో పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం అమలు చేయడం ద్వారా మశూచి వ్యాప్తిని పూర్తిగా అరికట్టారు. ఇటీవలి కాలంలో నివారణ చర్యలు తగ్గడంతో కేసులు కమ్రేపీ పెరుగుతున్నాయి. ఈ ఏడాది దేశంలో మశూచికి సంబంధించిన మూడు మరణాలు నమోదైనట్లు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, ప్రివెన్షన్‌ విభాగం తెలపగా, వాస్తవానికి ఇలాంటి కేసులు చాలానే ఉన్నట్లు రాష్ట్రాలు అంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు తమ రాష్ట్రంలో మశూచికి సంబంధించిన ఆరు వరకు మరణాలు నమోదైనట్లు పెన్సిల్వేనియా తెలిపింది.  

ఇదీ చదవండి: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల సత్తా

అక్టోబర్ 29 నాటికి, ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 4,852 తట్టు కేసులను CDC ధృవీకరించింది. న్యూయార్క్ రాష్ట్రంలో మొత్తం 178 కేసులు నమోదయ్యాయి. ఇవి ప్రధానంగా రాష్ట్రంలోని మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి. అధికారుల ప్రకారం 2026లో ఇక్కడ 16 కేసులు నమోదయ్యాయి. 

ఇదీ చదవండి: 1271 మందికి ఉద్వాసన : మహిళా సీఈవో భావోద్వేగ లేఖ వైరల్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)