Breaking News

అమెరికాను ముంచెత్తిన వరదలు

Published on Wed, 07/16/2025 - 03:03

వాషింగ్టన్‌: న్యూయార్క్‌ నగరంతో సహా అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. అనేక నగరాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్‌ స్టేషన్లు, సబ్‌వేలు మునిగిపోయాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. సోమవారం సాయంత్రానికే న్యూయార్క్, వాషింగ్టన్, బాల్టీమోర్, నెవార్క్, న్యూజెర్సీ, వర్జీనియా వంటి అనేక ప్రాంతాలలో వరద హెచ్చరికలు జారీ చేశారు.

సాయంత్రమే స్టేటెన్‌ ఐలాండ్, మాన్‌హట్టన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. న్యూయార్క్‌లో వాహనాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. డ్రైవర్లకు రెస్క్యూ సిబ్బంది సహాయం చేశారు. న్యూజెర్సీలో వరదల కారణంగా బస్సులు, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఆకస్మిక వరదలు, భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులు ఇళ్లలోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించారు. న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాల్లో 5 అంగుళాల వరకు వర్షం కురిసింది.

టెక్సాస్‌లో 131కి చేరిన మృతులు..  
మరోవైపు టెక్సాస్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 131కి పెరిగింది. గ్రేటర్‌ కెర్‌విల్లే ప్రాంతంలో 97 మంది ఆచూకీ తెలియలేదు. కెర్‌ కౌంటీ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది పిల్లలే కావడం గమనార్హం.  

విమాన కార్యకలాపాలకు అంతరాయం..  
తుఫాను కారణంగా సోమవారం ఒక్క రోజే అమెరికా అంతటా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 10,000 విమానాలు ఆలస్యమయ్యాయి. 1,600 కంటే ఎక్కువ రద్దయ్యాయి. ఫ్లోరిడాను భారీ వర్షాలు ముంచెత్తే అవకావం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది విమాన రాకపోకలను మరింత ప్రభావితం చేయనుంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)