Breaking News

ట్రంప్‌కు షాకిచ్చిన డెమెుక్రాట్స్‌

Published on Wed, 07/29/2026 - 15:18

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పేరు వెంటే చాలు మెుదటగా గుర్తుకొచ్చేది వలసదారులపై ఆయన చేసే ఆగడాలే.. ఎంతో కాలంగా ‍అమెరికా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న వారిని ఏదో నెపంతో దేశం నుంచి గెంటేయాలని వలసదారులను ఇబ్బంది పెట్టేలా ఎన్నో కఠిన చట్టాలు ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌కు ఝలక్‌ ఇచ్చేలా  (H-1B) వీసాదారులకు సులభంగా గ్రీన్ కార్డ్ లభించేలా డెమొక్రాటిక్ సెనేటర్ అలెక్స్ పడిల్లా ఈ  సరికొత్త బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ నూతన బిల్లు ప్రకారం "ది రెన్యూయింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929" దీని ప్రకారం.. అమెరికాలో కనీసం ఏడేళ్లపాటు నిరంతరం నివసిస్తున్న వలసదారులు శాశ్వత నివాస హోదా (లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్) కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.1986 తర్వాత ఇప్పటివరకు ఎటువంటి మార్పులు చేయని వలస చట్టాన్ని ఈ ప్రతిపాదన ఆధునీకరిస్తుందని, దీనివల్ల 8 మిలియన్ల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సెనేటర్ అలెక్స్ మాట్లాడుతూ "కష్టపడి పనిచేసే వలసదారులపై ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న క్రూరమైన విధానాలను తిప్పికొట్టడానికి నేను ఒక సంవత్సరం క్రితం ఈ బిల్లును ప్రవేశపెట్టాను. అప్పటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న భయానక విధానాలు మరింత పెరిగాయి. ఈ దేశంలో తమ జీవితాలను నిర్మించుకున్నప్పటికీ కుటుంబాలు నిరంతరం అనిశ్చితిలోనే జీవిస్తున్నాయి. ప్రతిరోజూ మన ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి తోడ్పడుతున్న మిలియన్ల కొద్దీ దీర్ఘకాలిక నివాసితులను కాంగ్రెస్ విస్మరించకూడదు. మన వలస చట్టాలను ఆధునీకరించి, చట్టబద్ధమైన శాశ్వత నివాసానికి సరైన మార్గాన్ని సృష్టించాల్సిన సమయం ఆసన్నమైంది."అని అన్నారు.

భారతీయ నిపుణులకు ప్రయోజనం
భారతీయ నిపుణులు హెచ్-1బీ వీసాదారుల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ పరిమితుల కారణంగా వీరు శాశ్వత నివాసం కోసం చాలా కాలం పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన భారతీయులకు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.


చట్ట రూపం దాల్చడం కష్టమే?

అయితే ఈ బిల్లు చట్టం రూపం దాల్చడం దాదాపు అసాధ్యం ఎందుకంటే  ఈ బిల్లు అక్కడి సెనేట్‌, ప్రతినిధుల సభ రెండింటిలోనూ ఆమోదం పొందాలి. అనంతరం ఆబిల్లు చివరకు అమెరికా అధ్యక్షుడి వద్దకు వెళ్తుంది. అధ్యక్షుడు దానిపై సంతకం చేస్తే అది అధికారిక చట్టం (Law) అవుతుంది. అయితే, రిపబ్లిక్  సభ్యులు దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నందున ప్రస్తుతానికి ఈ బిల్లు ఆమోదం పొందడం ఎంతమాత్రం సాధ్యం కాదనే చెప్పుకోవచ్చు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)