Breaking News

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన ప్రకటన

Published on Tue, 01/28/2025 - 07:03

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు తక్షణ రక్షణ కవచం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ తరహాలో ఐరెన్‌ డోమ్‌ నిర్మించుకుంటామని వ్యాఖ్యానించారు.  

ఇజ్రాయెల్‌(Israel)పై జరిగే రాకెట్ దాడులను ఐరన్‌ డోమ్‌ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో అమెరికాకు ఓ ఐరన్‌ డోమ్‌ను నిర్మించుకుంటామని ట్రంప్‌ అంటున్నారు. రక్షణ కార్యదర్శిగా పీట్‌ హెగ్స్‌త్‌ బాధ్యతలు తీసుకునే కార్యక్రమం మియామీలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్‌.. ఐరన్‌ డోమ్‌(Iron Dome) వ్యాఖ్యలు చేశారు. అత్యవసరంగా ఆ నిర్మాణం జరగాల్సిన ఆవశ్యకత ఉందని, అతిత్వరలో ఆ దస్త్రంపై సంతకం చేస్తానని వెల్లడించారాయన.

👉ఇజ్రాయెల్‌ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఐరన్‌ డోమ్‌. నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకొంటుంది. ఆకాశంలో క్షిపణులు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్‌ వాసులు ధైర్యంగా తమ పని తాము చేసుకొనేట్లు చేసింది.

👉2006లో హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. నాడు వేల రాకెట్లను ఆ సంస్థ టెల్‌అవీవ్‌ పై ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొంది. దీంతో ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌కు తయారీకి నిర్ణయించింది. దీనికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. 2008 నాటికి టమిర్‌ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011 నాటికి అందుబాటులోకి తెచ్చింది.

👉ఇజ్రాయెల్‌  రక్షణ వ్యవస్థ చిట్టచివరి దశలో ఐరన్‌ డోమ్‌ ఉంటుంది. హమాస్(Hamas), హెజ్‌బొల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చేయడంతో ఇది ఆ మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది.

👉ఐరన్‌ డోమ్‌ సక్సెస్‌ రేటు 90శాతానికి పైగానే ఉంది. అక్టోబర్‌ 7న హమాస్‌ దాడిలో వేల రాకెట్లను ఇది కూల్చేసింది. కానీ, కొన్ని దీని బారినుంచి తప్పించుకొని ఇజ్రాయెల్‌ వాసుల మరణాలకు కారణమయ్యాయి. ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 50 వేల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. దూసుకొచ్చే ఒక్కో  ముప్పును పేల్చేయడానికి రెండు క్షిపణులను ఐరన్‌ డోమ్‌ ప్రయోగిస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ వద్ద 10 ఐరన్‌ డోమ్‌ బ్యాటరీలు ఉన్నట్లు రేథియాన్‌ అంచనావేసింది. దీనిని వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చవచ్చు. 2020లో అమెరికాకు రెండు బ్యాటరీలను ఎగుమతి చేశారు.  

ఐరన్‌ డోమ్‌ ఎలా పని చేస్తుందంటే..

  •    ఐరన్‌ డోమ్‌ను స్థానికంగా ‘కిప్పాట్‌ బర్జెల్‌’ అంటారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. 

  •    దీనిలో రాడార్, కంట్రోల్‌ సెంటర్, మిసైల్‌ బ్యాటరీ ఉంటాయి. 

  •    రాడార్‌ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. 

  •    అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే.. వదిలేస్తుంది. 

  •    అదే జనావాసాలు అయితే మాత్రం రాకెట్‌ను ప్రయోగించి దానిని ధ్వంసం చేస్తుంది. 

  •    ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్‌ సిస్టమ్, రఫెల్‌ సంస్థలు పనిచేశాయి.

ప్రతి ఐరన్‌ డోమ్‌ బ్యాటరీలో నాలుగు లాంచర్లు ఉంటాయి. ఒక్కోటి 10 సెకన్లలో 20 క్షిపణులను ప్రయోగించగలవు. అత్యధిక ముప్పులను ఏకకాలంలో ఎదుర్కొనేలా దీనిని డిజైన్‌ చేశారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు