Breaking News

Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి

Published on Thu, 11/28/2024 - 07:01

పెషావర్ : పాకిస్తాన్‌లో ముస్లింలకు ముస్లింలే శత్రువులుగా మారారు. ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో సున్నీ- షియా వర్గాల మధ్య  జరిగిన ఘర్షణల్లో 10 మంది మృతిచెందారు. మరో 21 మంది గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాక్‌లోని ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుల్లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ అలీజాయ్- బగన్ వర్గాల మధ్య ఘర్షణలు గత వారం శుక్రవారం ప్రారంభమయ్యాయి. గత శుక్ర, శనివారాల్లో జరిగిన హింసాకాండలో 37 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అయితే గురువారం కాన్వాయ్‌పై జరిగిన దాడికి బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు.

ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి షియా, సున్నీ వర్గాల పెద్దలకు మధ్య జరిగిన సమావేశంలో ఇరు వర్గాల మధ్య ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ అక్కడక్కడా ఘర్షణలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. తాజాగా మంగళవారం ఘోజాగరి, మతాసానగర్, కుంజ్ అలీజాయి ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. కుర్రం డిప్యూటీ కమిషనర్ జావేదుల్లా మెహసూద్ మాట్లాడుతూ, హంగూ, ఒరాక్జాయ్, కోహట్ జిల్లాలకు చెందిన మత పెద్దల సమక్షంలో శాంతి చర్చలు జరగనున్నాయని తెలిపారు. దీనికి  కోహట్‌ కమిషనర్‌ నాయకత్వం వహించనున్నారని తెలిపారు.

మరోవైపు ఈ ఘర్షణల తరువాత పరాచినార్‌కు వెళ్లే రహదారులను మూసివేయడంతో మందుల కొరత ఏర్పడిందని కుర్రం జిల్లా హెడ్‌క్వార్టర్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీర్ హసన్ ఖాన్ తెలిపారు. సున్నీ ఆధిపత్యం  కలిగిన పాకిస్తాన్‌లోని 24 కోట్ల జనాభాలో షియా ముస్లింలు 15 శాతం ఉన్నారు. సాధారణంగా ఇరువర్గాలు శాంతియుతంగా కలిసి జీవిస్తున్నప్పటికీ, ముఖ్యంగా కుర్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత హింస భూ వివాదంతో ముడిపడి ఉంది.

ఇది కూడా చదవండి: భారత్‌లో ప్లాంట్లు పెట్టండి 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)