ఇజ్రాయెల్‌లో సంచలనం: ముస్లిం మహిళ కెప్టెన్ ఎలాకు పట్టం

Published on Wed, 02/04/2026 - 07:46

జెరూసలేం: ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్‌)లో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన ముస్లిం అరబ్ మహిళ కెప్టెన్ ఎలా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు అరబిక్ భాషా ప్రతినిధిగా ఉన్న కల్నల్ అవిచై అద్రయీ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఐడీఎఫ్ చరిత్రలోనే ఈ స్థాయికి చేరుకున్న తొలి ముస్లిం మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

కెప్టెన్ ఎలా ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మొదట ఒక ఆసుపత్రిలో వాలంటీర్‌గా తన సేవలను ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత సైన్యంలో చేరారు. ప్రారంభంలో ఆమె తన సైనిక సేవ గురించి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రహస్యంగా ఉంచారు. అంకితభావంతో పనిచేస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఈ ఉన్నత స్థానానికి చేరుకున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.  వాస్తవాలను ప్రపంచానికి చాటిచెప్పే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు.

ఇజ్రాయెల్ సైన్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న ముస్లిం మహిళగా కెప్టెన్ ఎలా నిలిచారు. కేవలం ఒక సైనికురాలిగానే కాకుండా, తన కమ్యూనికేషన్ నైపుణ్యాలతో తప్పుడు సమాచారాన్ని  అడ్డుకోవడంలో ఆమె అగ్రభాగాన ఉన్నారని చెబుతారు. ఆమె నియామకం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా నిలిచింది.

#

Tags : 1

Videos

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)