Breaking News

మస్క్‌.. ‘ది అమెరికా పార్టీ’కి 80 శాతం మద్దతు

Published on Sat, 06/07/2025 - 09:02

వాషింగ్టన్‌ డీసీ: ప్రపంచ కుబేరుడు, టెక్‌ దిగ్గజం ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇటీవల మస్క్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో యూఎస్‌లో కొత్త రాజకీయ పార్టీ కోసం పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో కొత్త పార్టీకి సమయం ఆసన్నమయ్యిందా? అని మస్క్‌ ‘ఎక్స్‌’ యూజర్లను అడిగారు. దీనికి వచ్చిన ఆసక్తికర ఫలితాలను తాజాగా ఆయన వెల్లడించారు.

మస్క్‌ తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు 80 శాతం మంది యూజర్లు మద్దతు పలికారు. ఈ ఫలితాల వెల్లడి తరువాత మస్క్‌  తన రాజకీయ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ‘ఎక్స్‌’లో వైరల్‌ అవుతున్న ఈ పోస్టులో మస్క్‌.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని, 80 శాతం ప్రజలు దీనికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో  మస్క్ పలు విమర్శలు చేశారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, అతనికి కృతజ్ఞత లేదని మస్క్‌ ఆరోపించారు. దీనికి స్పందనగా ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ట్రూత్‌లో మస్క్ కంపెనీలకు ఫెడరల్ కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేస్తానని హెచ్చరించారు. ఎలాన్ మస్క్- డోనాల్డ్ ట్రంప్  మొన్నటి వరకూ ఎంతో సన్నిహితులుగా మెలిగారు. గత జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో హత్యాయత్నం నుండి ట్రంప్ తృటిలో బయటపడిన అనంతరం మస్క్ బహిరంగంగా ఆయనకు మద్దతును ప్రకటించారు. అయితే ప్రస్తుతం వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. 
 


ఇది కూడా చదవండి: 400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)